విదేశాల్లో పిల్లల పెంపకం ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Webdunia
గురువారం, 19 ఫిబ్రవరి 2015 (18:53 IST)
విదేశాల్లో పిల్లల పెంపకం ఎలా ఉంటుందంటే.. నార్వేలో ఎముకలు కొరికే చలి ఉంటుంది. అయినా సరే తగిన జాగ్రత్తలు చెబుతూ పిల్లల్ని బయటకు పంపేస్తారట. వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేలా చేస్తారట. ఇదే కాదు.. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేట్ డేకేర్‌లు ఉంటాయి. పిల్లలకు ఏడాది వచ్చాక ప్రతి ఒక్కరినీ కొంత డబ్బు చెల్లించి కొన్నిరోజులు అక్కడ ఉంచాలి. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ వాళ్లక్కడే ఉంటారు. అదీ ఎక్కువ సమయం బయటే. 
 
ఇక వియత్నాంలో తల్లిదండ్రులకు పిల్లలకు తొమ్మిదినెలలు వచ్చేసరికి న్యాపీ చేయడం మానేస్తారు. పిల్లలు తమ బాత్రూం అవసరాన్ని తెలియజేసేలా చిన్నగా ఈలవేయడం నేర్పిస్తారు. ఈల శబ్ధం వినిపించగానే వాళ్లను బాత్రూంకి తీసుకెళ్తారు. 
 
పిల్లలు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలంటే.. వాళ్లను వీలైనంత వరకు ఎక్కువ సేపు ఆరుబయట ఉంచాలని పరిశోధకులు అంటున్నారు. ఇంట్లో ఉండనివ్వడం, ఏసీలకు బాగా అలవాటు చేయడం వంటివి పిల్లల ఆరోగ్యానికి అంత మంచివి కావని చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. ఆరు బయట ఉంచడం ద్వారా చిన్నారులకు తాజా గాలి అందుతుందని... అది వాళ్ల గుండెకూ, ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. 
 
పారెంట్స్ ఆఫీసుకు వెళ్లొచ్చాక పిల్లల్ని ఆరుబయట ఆడుకోనివ్వడం.. ముఖ్యంగా పిల్లలతో కలిసి ఆడుకోవడం చేయాలి. ఒంటరిగా బయటకు వెళ్లే స్వేచ్ఛను ఇస్తూనే జాగ్రత్తలు కూడా చెప్పాలి. విదేశాల్లో పిల్లలకు ఆత్మవిశ్వాసంతో పాటు ధైర్యాన్ని నూరిపోస్తారు. నాలుగేళ్లకే పిల్లలు వాళ్లంతట వాళ్లు బయటకు వెళ్లేలా ధైర్యాన్ని కల్పిస్తారు. ఒంటరిగా స్కూల్స్‌కు వెళ్లేలా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రపంచంతో ఆడుకుంటున్న ఇరాన్, మళ్లీ హర్మూజ్ జలసంధిని మూసేసింది

హృద్యమైన ప్రేమకథ.. ఎత్తు లేకపోతేనేం.. పర్లేదు వివాహం చేసుకున్న యువతి

చున్నీ వేసుకోమన్నందుకు ద్వారకా తిరుమల మహిళా సెక్యూరిటీ గార్డుపై దాడి, వీడియో

పాదయాత్ర చేస్తా, మావిగన్ గురించి ప్రజలకు వివరిస్తా: జగన్ ప్రకటన

భర్తకు కిడ్నీ దానం చేయాలట.. భార్యాభర్తల మధ్య నిద్రపోతున్న అత్త .. ఫోటోలు తీసే మామ!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుసగా రూ.100 కోట్ల చిత్రాలు.. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీతో ప్రదీప్‌కు కలిసొస్తుందా?

Lokesh Kanagaraj: ఈ ఏడాదిలోనే అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ చిత్రం షూటింగ్

Dhanush: ధనుష్ కారాలోని కన్నమ్మా ఎన్ కన్నమ్మ పాట 1 మిలియన్ వ్యూస్ దాటింది

Ramya Krishna: అల్లు అర్జున్.. రాకా లో రమ్యక్రిష్ణ - ఏడు విదేశీ భాషలలో విడుదలకు సన్నాహాలు

Thiruveer: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ల చిత్రం ఓ..! సుకుమారి షూటింగ్ పూర్తి

Show comments