Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేరెంట్స్ భావోద్వేగాలు పిల్లలపై ప్రభావం చూపిస్తాయా..?

Webdunia
FILE
తల్లిదండ్రుల హావభావాలు పిల్లల గుణగణాలపై తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. అలాగే తల్లిదండ్రుల సంతోషం, కోపం, ఉద్వేగం లాంటివన్నీ కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తాయనీ.. పేరెంట్స్ మానసికంగా మంచిగా ఉంటే, పిల్లలు కూడా మంచివారిగా తయారవుతారని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యంగా కవల పిల్లలపై తల్లిదండ్రుల ప్రభావం అధికంగా ఉంటుందనీ, బిడ్డల మానసికాభివృద్ధికి తల్లిదండ్రులు కారణభూతులవుతారు కాబట్టి వారు సంతోషంగా, ఉంటూ పిల్లల్ని సంతోషంగా ఉంచాలని వైద్యులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రోల్‌మోడల్‌గా ఉండాలనీ, పిల్లలకు స్వాభిమానం చిన్నప్పటినుంచే నేర్పాలని వారంటున్నారు.

తల్లిదండ్రులు మారిజానా, హెరాయిన్‌ సేవిస్తే అది పిల్లలపై ప్రభావాన్ని కలుగజేస్తుందనీ, ముఖ్యంగా తల్లి గర్భం దాల్చినప్పుడు బిడ్డ భవిష్యత్తుకోసం మాదక ద్రవ్యాలు సేవించరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తండ్రి కూడా వాటి జోలికి పోరాదు. బిడ్డ పుట్టిన తర్వాత తండ్రి తరచుగా పిల్లవాడితో అన్యోన్యతను పెంచుకోవాలి. తల్లిచూసుకుంటుంది కదా అని.. ఆఫీస్‌కు, క్లబ్‌లకే కాలం వెచ్చించరాదు. కనీసం రోజూ గంట సేపు బిడ్డతో గడపాలని వారు తెలిపారు.

ఇక చివరిగా.. చిన్నపిల్లలు వారికేం తెలుసులే అని తేలిక భావనతో తల్లిదండ్రులు ఉండకూడదు. పిల్లలతో గడిపినప్పుడు వారిని ఆడించటం, మాట్లాడటం, ముద్దు పెట్టడం, చక్కిలిగింతలు పెట్టడం.. లాంటివన్నీ పిల్లలకు సంతోషాన్ని కలిగించేవే. తల్లిదండ్రులు వీటిని ఎప్పుడూ మరువకూడదు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments