Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలు హోంవర్క్ చేయడానికి మారాం చేస్తున్నారా..!!

Webdunia
గురువారం, 12 ఏప్రియల్ 2012 (10:51 IST)
FILE
ప్రతిరోజూ పిల్లలతో హోంవర్క్ చేయించడం తల్లిదండ్రులకు ఓ సవాల్‌గానే ఉంటుంది. కొందరు పిల్లలు స్కూల్ నుంచి రాగానే బ్యాగు పక్కన పడేసి ఆటలాడటానికి పరుగెత్తుతారు. ఉదయం లేవగానే హోంవర్క్ చేయలేదనే విషయం గుర్తొచ్చి, టీచర్ తిడుతుందని లేదా కొడుతుందని స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తారు. అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వారితో హోంవర్క్ సులభంగా పూర్తిచేయించవచ్చు.

* ప్రతిరోజూ పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీచర్లు ఏం చెప్పారు? చేయాల్సిన హోంవర్క్ ఏంటి? అనే విషయాలను అడిగి కనుక్కోవాలి.

* హోంవర్క్ చేసే సమయంలో పిల్లలకు చాలా సందేహాలు వస్తుంటాయి. అలాంటపుడు దగ్గరుండి వారి సందేహాలను తీర్చాలి. దాంతో వారు మరింత ఉత్సాహంగా హోంవర్క్ పూర్తి చేస్తారు.

* పిల్లలు నలుగురైదుగురు కలిసి ఒకేచోట కూర్చుని హోంవర్క్ చేసుకొనేలా చేస్తే మరీ మంచిది. ఒకరిని చూసి ఒకరు హోంవర్క్ తొందరగా ఉత్సాహంగా కంప్లీట్ చేస్తారు.

* సమయంలోగా హోంవర్క్ కంప్లీట్ చేసుకోవాలని షెడ్యూల్ పెట్టాలి. దీనివల్ల పిల్లలకు షెడ్యూల్‌లో పనిపూర్తి చేసుకునే అలవాటు వస్తుంది.

* పిల్లలు హోంవర్క్ చేసే సమయంలో పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడటం చేయకూడదు. దానివల్ల వారి కాన్‌సన్‌ట్రేషన్ దెబ్బతింటుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కార్చిచ్చులో కాలిపోయిన hollywood సెలబ్రిటీల ఆస్తులు, పదివేల ఇళ్లకు పైగా బుగ్గి (video)

Rahul Gandhi: తెలంగాణలో జనవరి 27న మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ పర్యటన

బోయ్‌ఫ్రెండ్ కష్టాల్లో వున్నాడని భర్త డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసింది... ఆ తర్వాత? (video)

స్మార్ట్‌ఫోన్ కోసం కుమారుడి ఆత్మహత్య.. అదే తాడుతో ఉరేసుకున్న తండ్రి.. ఎక్కడ?

Nara Lokesh: జగన్ మామ మోసం చేసినా చంద్రన్న న్యాయం చేస్తున్నారు.. నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ద నటులతో నటించా, ఆత్మహత్య చేసుకునే స్థితిలో వున్నా: పావలా శ్యామల (video)

ది రైజ్ ఆఫ్ అశోక నుంచి సతీష్ నీనాసం ఫస్ట్ లుక్

టెక్నాలజీ కీలకపాత్రతో నూతన చిత్రం షూటింగ్

సంక్రాంతికి వస్తున్నాం అందరూ ఎంజాయ్ చేస్తారు: వెంకటేష్

తెలంగాణలో కల్లు, మటన్: తెలంగాణ కల్చర్‌ను అవమానిస్తానా: దిల్ రాజు (video)

Show comments