Webdunia - Bharat's app for daily news and videos

Install App

"పిట్ట కొంచెం.. కూత ఘనం" అనిపించిన ప్రణవ్

ఐన్‌స్టీన్ కంటే సమర్థుడు ఈ బుడతడు

Webdunia
" పిట్టకొంచెం... కూత ఘనం" సామెతకు సరిగ్గా సరిపోతాడు ఈ ఆరేళ్ల భారత సంతతికి చెందిన బుడతడు ప్రణవ్ వీరా ఐక్యూ 176. ప్రణవ్ వయసు ఆరేళ్లయినా, ఐన్‌స్టీన్ కంటే గొప్ప మేధాస్సు కలిగినవాడని చెప్పవచ్చు. ఎందుకంటే, ఐన్‌స్టీన్ ఐక్యూ 160 మాత్రమే కాగా, ఈ బుల్లి మేధావి ఐక్యూ మాత్రం 176. దీంతో ప్రణవ్ ఐన్‌స్టీన్ కంటే అధిక శక్తి సామర్థ్యాలున్నవాడిగా పరిగణింపబడుతున్నాడు.

నాలుగన్నర సంవత్సరాలప్పుడే ఇంగ్లీషులోని ఆల్ఫాబెట్లన్నింటినీ పై నుంచి కిందకు, కింద నుంచి పైకి చకచకా చెప్పేవాడని ప్రణవ్ తల్లిదండ్రులు ప్రసాద్, సుచిత్రా వీరాలు సంతోషంగా చెబుతున్నారు. ఇప్పుడు ఆ బాలుడు... అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారందరి పేర్లను వరుస క్రమంలో ఏకధాటిగా చెప్పేస్తాడని వారు వెల్లడించారు.

అలాగే... గడచిపోయిన సంవత్సరాలకు సంబంధించి... ఏ తేదీన ఏ వారం, ఏ రోజు వస్తుందో కూడా ఈ బుడతడు గుక్క తిప్పుకోకుండా చెప్పేస్తాడట. ఇకపోతే... వీడియో గేమ్‌లు ఆడటంలో అయితే ప్రణవ్‌ది అందవేసిన చెయ్యే సుమా...! ఇంత చిన్న వయస్సులోనే అతడి పరిణతిని చూసి ముచ్చటపడనివారు లేరంటే నమ్మండి.

ఇదే విషయాన్ని... మిల్‌ఫోర్డ్‌లోని మెక్ కార్మిక్ ఎలిమెంటరీ పాఠశాల ఉపాధ్యాయిని మాట్లాడుతూ... తమ స్కూల్లో చదువుతున్న ప్రణవ్ సామాన్యుడు కాడనీ, అతడి అసాధారణ ప్రతిభా సామర్థ్యాలను చూస్తే ముచ్చటేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

ఇలా ఉంటే... నువ్వు భవిష్యత్తులో ఏం చేస్తావ్ నాన్నా అని ఎవరైనా అడిగితే, ఎలాంటి తడబాటూ లేకుండా ఖగోళ శాస్త్రవేత్తనవుతానని చెబుతున్నాడు ఈ చిన్నారి ప్రణవ్. సో... పిల్లలూ... ప్రణవ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా...!
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

Show comments