Webdunia - Bharat's app for daily news and videos

Install App

పదేళ్లకే గణితంలో ఘనాపాఠి ఈ చిచ్చర పిడుగు...!!

Webdunia
FILE
ఈ చిచ్చర పిడుగుకి పట్టుమని పదేళ్లు కూడా నిండలేదు. అయితేనేం గణితంలో ఘనాపాఠి అనిపించుకుని ఔరా అనిపిస్తున్నాడు. ఇప్పటికే జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (జీసీఎస్ఈ), అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ (ఏఎస్) పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత సాధించిన ఈ చిన్నారి పేరు "ఇ ఫాన్". లండన్‌కు చెందిన ఈ బాలుడు గణితంలో యూనివర్సిటీ విద్యార్థులతో పోటీపడుతూ వచ్చేనెలలో "ఎ" లెవల్ పరీక్షలు రాసేందుకు కూడా సిద్ధమవుతున్నాడు.

ఈ పిల్లాడి శక్తి సామర్థ్యాలను తెలుసుకున్న ప్రాథమిక పాఠశాల యాజమాన్యం, తన కోసం ప్రత్యేకంగా ఓ వర్సిటీ ప్రొఫెసర్‌ని సైతం అధ్యాపకుడిగా నియమించుకోవటం గమనార్హం. ఇదలా ఉంచితే.. గత ఏడాది ప్రాథమిక పాఠశాలల స్థాయిలో పదకొండేళ్ల వయసు పిల్లలకు జరిగిన జాతీయస్థాయి గణిత పోటీలలో ఇ ఫాన్ దాదాపు లక్షమందిని అధిగమించి మొదటి స్థానంలో నిలిచాడు.

కేవలం గణితంలోనే కాకుండా.. ఇంగ్లీషు, ఫిజిక్సులలో కూడా దిట్ట అయిన ఈ బడుద్దాయి ఉపాధ్యాయుల, మేధావుల ప్రశంసలను అందుకుంటున్నాడు. మరోవైపు పియానో పరీక్షలకు సైతం సిద్ధమవుతున్న ఈ కుర్రాడి గురించి నట్స్ ఫోర్డ్ స్కూల్ ఉప ప్రధానోపాధ్యాయుడు మాట్లాడుతూ... ఇన్నాళ్ల ఉద్యోగ జీవితంలో ఇలాంటి విద్యార్థిని ఎప్పుడూ చూడలేదన్నారు.

పశ్చిమ లండన్‌లోని బ్రునెల్ వర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో సీనియర్ లెక్చరర్‌గా పనిచేస్తున్న ఇ ఫాన్ తండ్రి మిజి ఫాన్ మాట్లాడుతూ.. మూడేళ్ల వయసులోనే భిన్నాల గురించి మాట్లాడేవాడని అన్నారు. తన వయసు పిల్లలు ఏళ్ల తరబడి శ్రమిస్తేగానీ, పరిష్కరించటం సాధ్యంకానీ మ్యాథ్య్ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను అతడి కోసం కొన్నామనీ, అయితే తను రెండు విడతల్లోనే దాన్ని పరిష్కరించేశాడనీ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

ఈ చిచ్చరపిడుగు ఇ ఫాన్ మాట్లాడుతూ.. తాను పెద్దయ్యాక ఏంకావాలో ఇంకా నిర్ణయించుకోలేదని అన్నాడు. నేర్చుకోగలిగినంత నేర్చుకోవాలనుకుంటున్నాననీ, ఫుట్‌బాల్‌లో తనకంత ప్రావీణ్యం లేదు కాబట్టి, దానిని కూడా నేర్చుకుంటానని చెబుతున్నాడు. అయితే అన్నింట్లోనూ ప్రావీణ్యం సాధించటం సాధ్యం కాకపోవచ్చుకదా.. అని అంటున్నాడీ బాల గణిత మేధావి. నిజమేగానీ.. నువ్వెళ్లే వేగం చూస్తుంటే.. దేన్నయినా సరే చిటికెలో సాధించేస్తావని అనిపిస్తోంది ఇ ఫాన్.. సో.. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్...!!

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments