Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ చిన్నారులకు హాప్కిన్స్ సహాయం...!

Webdunia
FILE
ప్రపంచ ప్రఖ్యాత సినీ, టీవీ నటుడు ఆంథోనీ హాప్కిన్స్ ఆంధ్రప్రదేశ్‌లోని నిరుపేద విద్యార్థులకు సహాయం చేసేందుకు ముందొకొచ్చారు. ఆంధ్రలో విద్యాభ్యాసానికి నోచుకోని నిరుపేద విద్యార్థుల విద్యా సదుపాయాల కోసం బ్రిటన్‌కు చెందిన ఒక ధార్మిక సంస్థ నిర్వహించనున్న ప్రముఖుల ఫొటోల, చిత్రాల వేలానికి తాను చిత్రించిన ఒక చిత్రాన్ని పంపించినట్లు ఆయన వెల్లడించారు.

" ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్" లాంటి చిత్రాలలో అత్యంత సంక్లిష్టమైన పాత్రలకు సైతం జీవం పోసిన హాప్కిన్స్, స్క్రిప్టులు వింటూ అలవోకగా స్కెచ్‌లు గీసేస్తుండటం పరిపాటి. అలా ఆయన చిత్రించిన చిత్రాలను చూస్తే.. ఎవరైనా సరే తొలినాటి పికాసో గుర్తుకొస్తున్నాడని అనక మానరు. టీవీ, చిత్ర రంగాల్లో తనదైన ప్రత్యేక శైలితో దూసుకెళ్తున్న హాప్కిన్స్ గీసిన చిత్రాలు కూడా అంతే ప్రాముఖ్యం సంతరించుకున్నాయంటే.. అతిశయోక్తి కాదు.

అలా హాప్కిన్స్ గీసిన అనేక చిత్రాలలో ఒక దానిని తాజాగా వేలానికి పెట్టారు. అలాగే.. హాప్కిన్స్‌తోపాటు పలువురు వెండితెర నటులు కూడా సంతకాలు చేసిన తమ ఫొటోలను కూడా ఈ వేలానికి పంపారు. వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేద బాలబాలికల విద్యాభ్యాసం కోసం ఖర్చు చేయనున్నట్లు హాప్కిన్స్ ఈ సందర్భంగా తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments