2014 ఎన్నికల్లో జగన్ ఉప్పెన... అన్ని పార్టీలూ కొట్టుకుపోతాయ్

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2013 (14:53 IST)
FILE
అక్రమాస్తుల కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కారాగారం పాలయ్యారు. 2014 ఎన్నికలకు మరో ఏడాది ఉంది. ఈ ఎన్నికల నాటికి జగన్ మోహన్ రెడ్డి బయటకు వస్తారని జగన్ సోదరి షర్మిలతోపాటు రోజా లాంటి వారు కూడా జోస్యం చెపుతున్నారు. రోజా అయితే ఓ అడుగు ముందుకు వేసి 2014 ఎన్నికల తర్వాత రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేస్తున్నారు.

కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం జగన్ పాల్పడిన ఆర్థిక నేరాలు చాలా తీవ్రమయినవనీ, జగన్ ఇప్పుడప్పుడే బయటకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. మరోవైపు సీబీఐ జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి చార్జిషీట్లపై చార్జిషీట్లు వేసుకుంటూ వెళుతోంది. దీంతో జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రావడం కష్టతరంగా మారింది.

ఎన్ని చార్జిషీట్లు వేసినా 2014 ఎన్నికల నాటికి జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ లభించడం ఖాయమనీ, ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు కనుక త్వరలోనే బయటకు వస్తారని వైకాపా నేతలు అంటున్నారు. 2014 ఎన్నికల్లో జగన్ సునామీ దెబ్బకు అన్ని పార్టీలు కొట్టుకుపోతాయనీ, భారీ మెజారిటీతో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని అంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

Show comments