వంగవీటి రాధా చేరిక... వల్లభనేని వంశీ కూడా జై జగన్ అంటారా..?!!

Webdunia
శుక్రవారం, 27 ఏప్రియల్ 2012 (22:51 IST)
FILE
ఉప ఎన్నికలకు ముందే కృష్ణా జిల్లాలో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు దొంగచూపులు చూస్తున్నారు. అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన వంగవీటి రాధాకృష్ణ జగన్ పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు.

తాజాగా శుక్రవారం మరో ఆసక్తికర సంఘటన జరిగింది. కృష్ణాలో తెదేపాకు కీలక నాయకుడిగా పేరున్న వల్లభనేని వంశీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ జగన్‌ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆ ప్రక్కనే ఉన్న వంగవీటికి కూడా చెప్పేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

కృష్ణా జిల్లాలో కలియతిరుగుతున్న జగన్.. జిల్లాలో పట్టున్న నేతలను తన గూటికి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో వల్లభనేని వంశీ - జగన్‌ను విష్ చేయడాన్ని చూస్తే ఏదో ఒకరోజు వల్లభనేని కూడా జై జగన్ అంటారేమోననే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు. చూద్దాం..
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments