మా ఇద్దరినీ ఎదుర్కొనలేక నీచ రాజకీయాలా: జగన్ ప్రశ్న

Webdunia
మంగళవారం, 20 సెప్టెంబరు 2011 (11:12 IST)
తన తల్లిని, తనను ఎదుర్కొనలేక అధికార ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన కృష్ణా జిల్లా ఓదార్పు యాత్రలో మాట్లాడుతూ ఒక తల్లిని, ఒక బిడ్డను ఎదుర్కోలేక కాంగ్రెస్, తెదేపాలు నీచ రాజకీయాలకు, కుట్రలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో జీనచ్ఛవంలా మారిన కాంగ్రెస్‌ను రెండు సార్లు అధికారంలోకి తెచ్చిన వైఎస్సార్ మరణిస్తే ఆయన మరణాన్ని తట్టులేక వందల మంది చనిపోతే.. వారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆయన కుమారుడిగా తాను మాట ఇప్వడం తప్పా అని జగన్ ప్రశ్నించారు.

తాను చేపట్టిన ఓదార్పు యాత్రపై ఆంక్షలు విధించి తనను బయటకు వెళ్లేలా కాంగ్రెస్ అధిష్టానం చేసిందని ఆరోపించారు. అలా పార్టీ నుంచి బయటకు వచ్చిన రెండు నెలలకే ఆదాయం పన్ను శాఖ నోటీసులిచ్చారని, అదీ చాలక కాంగ్రెస్ మంత్రుల చేతనే కోర్టులో కేసులు వేయించి చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అదిచాలదన్నట్టుగా బద్ధశత్రువు లాంటి చంద్రబాబుతో చేతులు కలిపి కోర్టు మెట్లెక్కారని ఆరోపించారు. కేవలం ఒక తల్లిని, ఒక బిడ్డను ఇబ్బందులు పెట్టడానికి కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు నానా గడ్డి తింటున్నారని దుయ్యబట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

Show comments