జగన్ పార్టీ జనం మాటలు... అందుకే జగన్‌కు బెయిల్ రావడం లేదా..?!!

Webdunia
శుక్రవారం, 10 మే 2013 (19:20 IST)
WD
అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఏడాది కాలంగా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కోర్టులకు బెయిల్ కోసం పిటీషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. సీబీఐ విచారణ మరోవైపు సాగుతూనే ఉంది. కాగా అసలు బెయిల్ విషయంలో పార్టీ నేతలు, ముఖ్య నాయకులు చేస్తున్న వ్యాఖ్యల వల్లనే జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రావడం లేదన్న కొత్త వాదనలు తెరపైకి వస్తున్నాయి.

ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న కొందరు నేతలు నేరుగా కోర్టులు, సీబీఐను విమర్శిస్తుండటంతో వ్యవహారం మరింత బెడిసికొడుతోందనీ, అందువల్లనే జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా పోతోందన్న వాదనలు వినబడుతున్నాయి.

గురువారంనాడు సుప్రీంకోర్టు అలా బెయిల్ పిటీషన్ ను తిరస్కిరించిందో లేదో మీడియా ముందు ఆ పార్టీ నాయకులు ప్రత్యక్షమయ్యారు. బొగ్గు కుంభకోణంలో సీబీఐకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన నేపధ్యాన్ని గుర్తు చేస్తూ పంజరంలో చిలుక చెప్పిన మాటలను విశ్వసించిన సుప్రీంకోర్టు జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ ఇవ్వలేదంటూ ఆ పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

మరో నేత చెవిరెడ్డి భాస్కర రెడ్డి అయితే కోర్టులను చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. కాగా చంద్రబాబు నాయుడు తనకు సుప్రీంకోర్టునే ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్నదా... అసలు వీళ్లు ఎటు పోతున్నారంటూ ప్రశ్నించారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి బెయిల్ వ్యవహారంలో వైకాపా నేతల వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Show comments