మాజీమంత్రి, వైకాపా మాజీ నాయకుడు మారెప్ప మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. జగన్ మోహన్ రెడ్డిని నమ్మితే పచ్చిమోసం చేశారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే ఒయాసిస్సులే కనబడతాయనీ, ఎంతదూరం వెళ్లినా అదే గతి అని చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న గౌరవంతో ఆ పార్టీలోకి వెళితే నిలువునా ముంచేశారని విమర్శనాస్త్రాలు సంధించారు.
జగన్ మోహన్ రెడ్డి బయటకు కనిపించినట్లు ఉండరనీ, ఆయనలో మరో కోణం ఉన్నదని చెప్పుకొచ్చారు. ఇలా రోజుకో నేత ఆరోపణాస్త్రాలు సంధించుకుంటూ జగన్ మోహన్ రెడ్డిని పలుచన చేస్తుంటే ఆయన తరపున స్పందించేందుకు ఎల్లప్పుడూ ముందుకు వచ్చే అంబటి రాంబాబు కనబడటంలేదు.
ఆయన ఎందుకు కనిపించడంలేదు... అంబటికి కూడా ఏమయినా వడ్డింపులు ఇచ్చారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తమ్మీద జగన్ గ్రాఫ్ ఎంత త్వరగా చుక్కలకంటా చూసిందో ఇప్పుడు అంతే వేగంతో నేలచూపులు చూస్తోందంటున్నారు. మరి జగన్ మోహన్ రెడ్డి వీటిని ఎలా నిలువరిస్తారో వెయిట్ అండ్ సీ.