ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉద్యోగాలు సాధించాలంటే ఏం చేయాలి?

ఐవీఆర్
మంగళవారం, 2 జూన్ 2026 (21:59 IST)
ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ ఇండస్ట్రీలో ఉద్యోగాలను సాధించాలనుకునేవారు, మంచి జీతాలు పొందాలంటే సాంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆలోచించాలి. ముఖ్యంగా అప్‌స్కిల్లింగ్... అంటే రంగానికి తగ్గట్టు మారడం. కేవలం బేసిక్ కోడింగ్ (Java, C++) నాలెడ్జ్‌తో సరిపెట్టుకోకుండా.. AI/ML, క్లౌడ్ కంప్యూటింగ్ (AWS/Azure), డేటా ఇంజినీరింగ్, లేదా సైబర్ సెక్యూరిటీ వంటి డిమాండ్ ఉన్న రంగాలలో నైపుణ్యం సాధించాలి.
 
ప్రాక్టికల్ పోర్ట్‌ఫోలియో వుండాలి. అంటే కేవలం రెజ్యూమేలో సర్టిఫికెట్లు పెట్టడం కంటే, స్వంతంగా చేసిన లైవ్ ప్రాజెక్ట్‌లు, గిట్‌హబ్(GitHub) ప్రొఫైల్, లీట్‌కోడ్(LeetCode)లో సమస్యల సాధన వంటివి చూపించగలిగితే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి.
 
ఐటీ రంగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇది ఒక చక్రం లాంటిది. ప్రస్తుత మందగమనం తాత్కాలికమే. టెక్నాలజీ మారినప్పుడల్లా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండే ఇంజినీర్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఉద్యోగాలు పోతాయి అని భయం నుంచి మన నైపుణ్యాలను ఇంకా ఎంత మేరకు మెరుగుపరుచుకోవాలన్న దానిపై దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే... కాలం మారుతున్నకొద్దీ అధునాతన సాంకేతక సౌలభ్యాలు కూడా రావడం మనం చూస్తూనే వున్నాం. అలాగే ఏఐ కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రజలు కుక్కలు అని ఎలా అంటాను? టీవీకె గురించి నేనలా అన్నాననీ: రాఘవ లారెన్స్

కాశీలో రేణూ దేశాయ్.. ఎందుకో తెలుసా?

Mohanlal: మోహన్‌లాల్ సస్పెన్స్ థ్రిల్లర్ దృశ్యం 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌

Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది

V.V. Vinayak: వడ్డే నవీన్‌ సినిమాలు ఇష్టంతో చేయలేదు : వి. వి. వినాయక్

తర్వాతి కథనం
Show comments