వాట్సాప్‌కు గండికొట్టనున్న గూగుల్ అలో...? వాయిస్ కాలింగ్ మాత్రం ఉండదట..

గూగుల్ ఆండ్రాయిడ్ సేవ గూగుల్ అలో. గూగుల్‌ అలో అనే మెసెంజర్‌‌ను రూపొందించింది. గూగుల్ అలో.. వాట్సప్ తరహాలోనే ఫోన్ నెంబర్‌ను బట్టే ఉపయోగించాలి. దీంతో పాటు గూగుల్ అకౌంట్, పేరు ఇచ్చి అలోను ఉపయోగించడం ప్రా

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (16:01 IST)
గూగుల్ ఆండ్రాయిడ్ సేవ గూగుల్ అలో. గూగుల్‌ అలో అనే మెసెంజర్‌‌ను రూపొందించింది. గూగుల్ అలో.. వాట్సప్ తరహాలోనే ఫోన్ నెంబర్‌ను బట్టే ఉపయోగించాలి. దీంతో పాటు గూగుల్ అకౌంట్, పేరు ఇచ్చి అలోను ఉపయోగించడం ప్రారంభించవచ్చు. ఇరు సభ్యులు ఒకే అకౌంట్‌ను ఉపయోగించడం కుదరదు. అలాగే ఒకే అకౌంట్‌ను వేర్వేరు రెండు ఫోన్లలో ఉపయోగించడం కుదరరు. ఒక అకౌంట్‌ను ఒకే ఫోన్లోతే వాడే వీలుంటుంది. 
 
గూగుల్ అలోలో కొత్తగా ఏముందంటే..?
* ఇది మెసేజింగ్ యాప్.
* వాయిస్ మెసేజ్, స్టిక్కర్స్, ఇమేజ్, వీడియోలు పంపే వీలును కలిగివుంటుంది. 
* కానీ వాట్సాప్‌లోని వాయిస్ కాలింగ్ మాత్రం ఇందులో లేదు. 
* డాక్యుమెంట్లను పంపడం కుదరదు
* అలోకు వచ్చే మెసేజ్‌లను యాప్‌ను ఓపెన్ చేయకుండానే వీక్షించే సౌలభ్యం ఉంటుంది. 
* మెసేజ్ ఓపెన్ చేయకుండానే రిప్లే ఇవ్వొచ్చు. 
* అలోకు వచ్చే మెసేజ్‌లను సెలెక్ట్ చేస్తేనే రిప్లే ఆప్షన్‌ వచ్చేస్తుంది. దీంతో మెసేజ్ ఓపెన్ చేసి చదివి ఆపై రిప్లే ఇచ్చే పాత పద్ధతికి చెక్ పెట్టవచ్చు. 
 
గూగుల్ అలో హైలైట్స్ : 
గూగుల్ అలో హైలైటే గూగుల్ అసిస్టెంట్ కావడమే. బ్రౌజర్‌ను క్లిక్ చేయకుండానే వికీపీడియా చూసే వీలుంటుంది. క్యాలెండర్, మెయిల్, అలారం వంటి పలు ఫీచర్స్.. గూగుల్ అసిస్టెంట్ ద్వారా పొందవచ్చు. వాట్సప్ తరహాలో ఎన్‌క్రిప్ట్ చేయకుండా Incognito modeలో చాట్ చేయడం ద్వారా మెసేజ్‌లో ఫాస్ట్‌గా పాస్ అవుతాయి. ఐదు నిమిషాల నుంచి ఒక వారం వరకు ఈ మెసేజ్ డెలివరీకి టైమ్ సెట్ చేసుకోవచ్చు. అలో యాప్ ఉపయోగించే వారితో మాత్రమే చాట్ చేసే వీలుంటుందని గూగుల్ సంస్థ వెల్లడించింది.  
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుకోకుండా పొరపాటు జరిగింది.. క్షమించండి : గాయని మంగ్లీ

రాజకీయాల్లోకి రానున్న టాలీవుడ్ నటుడు.. ఎవరు?

న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పై స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ట్రైలర్ లాంచ్

Tilak Varma: రామ్ చరణ్ పెద్ది సెట్స్‌ను సందర్శించిన టీ20 ప్రపంచ కప్ స్టార్ తిలక్ వర్మ

Koti: మహిళలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా : కోటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రీమ్‌ టెక్నాలజీ నుంచి L40 అల్ట్రా AE, D20 అల్ట్రా ఆల్‌-ఇన్‌-వన్‌ రోబోటిక్ వాక్యూమ్స్‌

మంచినీరు ఇలా తాగితే శరీరానికి మంచి జరుగుతుంది

ఫ్యాబ్ ఇండియా ఉగాది కలెక్షన్‌తో కొత్త ఆరంభాల వేడుక

సాహస యాత్రలపై నాట్స్ అవగాహన సదస్సు

షి ద ఛేంజ్ 2026: హైదరాబాద్‌కు చెందిన శ్రీదేవి జాస్తికి స్విగ్గీ వారు సన్మానం

తర్వాతి కథనం
Show comments