Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెకనుకు వెయ్యి ట్రిలియన్ పనులు చేసే "సూపర్ కంప్యూటర్"

Webdunia
ఎలక్ట్రానిక్ రంగంలో చైనా ఏది చేసినా విప్లవమే.. కొత్త కొత్త ఉత్పత్తులను ప్రవేశ పెట్టడంలో చైనాకు పెట్టింది పేరు. ఇటీవలే ఓ "సూపర్ కంప్యూటర్‌"ను తయారు చేసింది. ఇది నిజంగానే సూపర్ అండీ బాబు...!! ఇది ఒక సెకనుకు వెయ్యి ట్రిలియన్ పనులను చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

అంటే ఎంతో తెలుసా.. ఒక కొటి ముప్పై లక్షల మంది ప్రజలు 88 సంవత్సరాలు పాటు చేసే పనిని ఇది ఒక్క సెకనులో చేస్తుంది. అంతే కాదు... గ్రంధాలయాల్లో ఉండే రెండు కోట్ల డెబ్బై లక్షల పుస్తకాలలో ఉన్న సమాచారాన్ని నిక్షిప్తం చేసేంత సామర్ధ్యం కూడా కలిగి ఉండటం ఇందులో ప్రత్యేకత.

థియాన్హే-1 పేరుతో రూపొందించిన ఈ సూపర్ కంప్యూటర్ ఈ నెల నుంచి పనులు ప్రారంభించనున్నారు. థియాన్జిన్‌లో ఉన్న జాతీయ సూపర్‌కంప్యూటింగ్ కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించింది. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ 2009లో ఈ సూపర్ కంప్యూటర్ పనులను ప్రారంభించింది.

థియాన్హే-1 సూపర్ కంప్యూటర్‌ను యానిమేషన్, బయోమెడికల్ రీసెర్చ్, ఏరోస్పేస్ ఎక్విప్‌మెంట్ డెవలప్‌మెంట్, రిసోర్స్ ఎక్స్‌ప్లోరేషన్, శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ డేటా, వాతావరణ సమాచారం వంటి వాటికి వినియోగించనున్నారు.

నవంబర్‌లో నిర్వహించిన టాప్-500 సూపర్ కంప్యూటర్‌లలో థియాన్హే-1 ఐదవ స్థానాన్ని ఆక్రమించింది. పీపుల్స్ డైలీ అనే పత్రిక గురువారం ఈ విషయాన్ని ప్రచురించింది. అమెరికా తర్వాత ఇటువంటి సూపర్ కంప్యూటర్ తయారు చేసిన దేశాలలో చైనా రెండవది కావడం విశేషం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Show comments