Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్యామ్ సంగ్ గెలాక్సీ బీమ్: స్మార్ట్ ఫోన్‌లా మెరిసిపోతుందా?

Webdunia
శుక్రవారం, 27 జులై 2012 (17:58 IST)
శ్యామ్ సంగ్ గెలాక్సీ బీమ్ ఫోన్ పేరు చెప్పగానే దాని ఫీచర్స్ గురించి తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఫోనును చూసినవారికి దీనికి ఉన్నటువంటి పికొ - ప్రొజెక్టర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనే కుతూహలం కలుగక మానదు. మరయితే ఎందుకాలస్యం.. చూద్దాం పదండి శ్యామ్ సంగ్ గెలాక్సీ బీమ్‌ను.
WD

గెలాక్సీ బీమ్ ఫోను ప్రొజెక్టర్స్‌లో కాంపాక్ట్ డిజిటల్ కెమేరాలను కలిగి ఉన్న మొట్టమొదటి ఫోను కావడం విశేషం. ఎన్‌హెచ్‌డి(640 x360) హై రిజల్యూషన్ మరియు 15 ల్యూమెన్‌తో తళతళలాడిపోతుంటుంది శ్యామ్ సంగ్ గెలాక్సీ బీమ్. అంతేకాదు రిజల్యూషన్ 50" మేర చూసిన అనుభవం కలుగుతుంది. గెలాక్సీ బీమ్ హంగామా సృష్టించడానికి మరొక కారణం ఏంటంటే, దానియొక్క 2000ఎమ్ఎహెచ్ బ్యాటరీ పవర్, ఇది Samsung SII I లోని బ్యాటరీ అంతటి సమర్థవంతమైనది.

స్మార్ట్ ఫోన్ల డిజైనింగ్ ఎలా ఉంటుందో దాన్ని తలదన్నే విధంగా శ్యామ్ సంగ్ రూపొందించబడింది, కనుక మార్కెట్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా కొత్తగా పరిచయం చేసిన పికొ-ప్రొజెక్టర్ శ్యామ్ సంగ్ గెలాక్సీ బీమ్ సొంతం. అంతేకాదు ఫోన్ లోపలి ఫీచర్ల విషయంలో కానీ, నాణ్యమయిన సాఫ్ట్‌వేర్ మరియు హార్డ్‌వేర్ల విషయంలో కానీ రాజీ లేకుండా తయారుచేయడం జరిగింది.

డిజైన్

దీని డిజైన్ దీని పేరుకు తగినట్లుగా ఉంటుంది. ముదురు పసుపు రంగులో మెరిసిపోయే ఈ ఫోన్ టీనేజర్లకు ఖచ్చితమైన ఛాయిస్. శక్తివంతమైన బ్యాటరీని కలిగిన ఈ ఫోనును చూస్తే ఉత్తేజం కలుగుతుంది. కాస్త బరువుగా అనిపించే ఈ గెలాక్సీ ప్రపంచంలోనే అత్యంత పలుచనైన ప్రొజెక్టర్ కలిగిన ఫోనయి ఉండటం విశేషం. ఇక ఈ ఫోను కొలతలను చూస్తే ఎత్తు 4.9 అంగుళాలు, వెడల్పు 2.5 అంగుళాలు, మందం 0.5 అంగుళం మేర ఉంటుంది.

480 X 80 పిక్జల్స్ రిజల్యూషన్‌తో సూపర్ అమొలెడ్ ఎల్సీడీ అమర్పులతో గెలాక్సీ బీమ్ ఫోనులోని రంగులు కానీ, ఫోన్ డిస్‌ప్లే కానీ కాంతివంతంగా ఉంటాయి. దీనికి ఉన్నటువంటి యాంటి రిఫ్లెక్టెన్స్ స్క్రీన్ వల్ల పట్టపగలు వస్తువులను ఎలా చూడగలుగుతామో అంత స్పష్టంగా స్క్రీన్‌ను చూడగలం.

ఇంటర్ఫేస్ మరియు పనితీరు

ఆండ్రాయిడ్ 2.3 జింజిర్‌బ్రెడ్‌తో ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ టచ్‌విజ్ ఇంటర్ఫేస్‌తో కోరుకున్న విలువలతో సంతృప్తికరంగా అనిపిస్తుంది. గూగుల్ అందించే సేవలైన యూ ట్యూబ్, నేవిగేషన్ తదితర సేవలను ఎంచక్కా స్పష్టంగా వీక్షించవచ్చు. కన్వన్షల్ కీ బోర్డునే కాకుండా వర్చువల్ కీ బోర్డును కూడా ఉపయోగించవచ్చు. సర్వసాధారణమైన అప్లికేషన్లతోపాటు మీరు ఇంకా ఆల్‌షేర్, కీస్ ఎయిర్, చాట్ ఆన్.. వగైరా వగైరా ఎన్నో ఈ ఫోను ద్వారా పొందవచ్చు. శబ్దానికి సంబంధించిన సేవల్లో సైతం ఈ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ వాయిస్, వ్లింగో వంటివి చొప్పించబడి ఉంటాయి. ఇలా మొత్తంగా ఇది ఆర్థికపరంగా అత్యంత సౌకర్యమైన ఫోనుగా చెప్పవచ్చు.

కెమేరా

5 మెగాపిక్జల్‌తో అరుదైన ఫేసింగ్‌తో ఉన్న కెమేరాతో ఫోటోలను స్పష్టంగా, షార్ప్‌గా ఫోటోలను క్లిక్ చేయవచ్చు. ఐతే వీడియో రికార్డింగ్ లో మాత్రం ఇది హెచ్డీ 720పి మేరకు చేయగలిగే వీలుంది. వీడియో రికార్డింగులో 1080పి వరకూ స్పష్టతను కోరుకునే వారికి ఇది ఒకింత నిరాశను కలిగిస్తుంది. ఇండోర్ షాట్స్ కంటే ఔట్‌డోర్ షాట్స్‌కు ఇది బాగా ఉపయోగంగా ఉంటుంది. ఇందులో లెడ్ ఫ్లాష్ ఉత్తమమైన భాగంగా చెప్పవచ్చు. అంతేకాదు శ్యామ్ సంగ్ ఆండ్రాయిడ్ కెమేరా ఫీచర్లలోని స్మైల్ షాట్, పనోరమ, యాక్షన్ షాట్స్ వంటివి కూడా ఉన్నాయి.

శ్యామ్ సంగ్ గెలాక్సీ బీమ్‌లోని ప్రొజెక్టర్ అమర్పుల్లోనే కాకుండా చాలా ఫీచర్లకు కుకీ - కట్టర్ ఉంటుంది. అందువల్ల మీరు ఒకేసారి ఒకటి లేదా రెండు సినిమాలను వీక్షించే అవకాశం ఉంటుంది. ఐతే బిల్ట్ ప్రొజెక్టర్ కలిగిన ఫోన్లు కాంతికంటే ఎక్కువ వేడిమి అనిపించడంతో వాటిని మూసేయడం జరుగుతుంది. కానీ ఈ ఫోనులో అలా కాదు.

మొత్తంగా చూస్తే శ్యామ్ సంగ్ గెలాక్సీ బీమ్ సంతృప్తికరమైన ఫోను. చూడగానే ఆకర్షించే డిజైన్‌ను కలిగి ఉండటమే కాకుండా ఆండ్రాయిడ్ సపోర్టర్‌తో చక్కటి పనితీరును కనబరుస్తుంది. కొత్త ఆండ్రాయిడ్ ఫోను కావాలనుకునేవారికి ఈ స్మార్ట్ ఫోన్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ తోపాటు అన్ని రకాల ఇతర బ్రాండ్లను రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో పొందవచ్చు. వివరాలకు www.reliancedigital.inతోపాటు ఫేస్‌బుక్ , ట్విట్టర్, యూ ట్యూబ్ లలోనూ చూడవచ్చు.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments