Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ రంగంవైపు కంప్యూటర్ ఉత్పత్తిదార్లు

Webdunia
గురువారం, 19 మార్చి 2009 (11:59 IST)
FileFILE
మొబైల్ రంగం, కంప్యూటర్ రంగం రెండూ వేటికవే సాటి. అయితే దేశ జనాభాలో 80 శాతానికి పైగా మొబైల్ ఎక్కవగా వినియోగిస్తున్నారనే విషయంలో ఎలాంటి సందేహం లేదు. దీన్ని బట్టి మొబైల్ ఫోన్ సగటు మనిషి జీవితంలో ఎంత నిత్యకృత్యమైపోయిందో వేరే చెప్పక్కర్లేదు.

ఈ నేపథ్యంలో మొబైల్, కంప్యూటర్.. ఈ రెండు రంగాలు ఒకతాటిపై నడిస్తే మరో విన్నూత్న శకం ఆరంభానికి నాంది పలికినట్లే. అలాంటి విన్నూత్న శకానికి నాంది పలికి.. విజయం సాధించింది ప్రముఖ అంతర్జాతీయ కంప్యూటర్ల తయారీ సంస్థల ఆపిల్ కంపెనీ.
మొబైల్ రంగంలోకి కంప్యూటర్ సంస్థలు..
  కంప్యూటర్ స్థాయి ప్రమాణాలతో ఐఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టి మొబైల్ రంగంలోకి ఆపిల్ కంపెనీ అడుగిడింది. ఈ ఐఫోన్ విజయంతో అనేక ఇతర కంప్యూటర్ ఉత్పత్తిదార్లు మరియు చిప్ కంపెనీలు మొబైల్ రంగంపై దృష్టి సారించాయి..      


కంప్యూటర్ స్థాయి ప్రమాణాలతో ఐఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టి మొబైల్ రంగంలోకి ఆపిల్ కంపెనీ అడుగిడింది. ఈ ఐఫోన్ విజయంతో అనేక ఇతర కంప్యూటర్ ఉత్పత్తిదార్లు మరియు చిప్ కంపెనీలు మొబైల్ రంగంపై దృష్టి సారించాయి. దీంతో ఆపిల్ విడుదల చేసిన కంప్యూటర్ ప్రమాణాలు గల ఈ ఐఫోన్ కన్నా రానున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువ ఆప్షన్‌లు వచ్చే అవకాశాలున్నాయి.

ఇప్పటికే కొత్త ఐఫోన్‌లో పూర్తి స్థాయి ఇంటర్నెట్, వివిధ రకాల ప్యాకేజీలు, హై-డెఫినిషన్ చిత్రాలు, వీడియో కాన్ఫరెన్సు తదితరాలు అందిస్తామని పీసీ కంపెనీలు హామీ ఇస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుత పరిణామాలను విశ్లేషిస్తే... మొబైల్ ఫోన్ రంగంలో ఐఫోన్ విడుదల అనంతరం... పోటీ విపరీతంగా పెరిగిపోయినట్లు కనబడుతోంది.

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం మాట ఎలా ఉన్నా... స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేసి తద్వారా కఠినమైన ఇలాంటి పరిస్థితుల్లోను తమ ఉనికిని చాటుకోవాలని మొబైల్ ఫోన్ కంపెనీలు, సెల్‌ఫోన్ తయారీదార్లు.. కంప్యూటర్ రంగం నుంచి మొబైల్ రంగంలోకి రానున్న, వచ్చేసిన కంపెనీలు ఉబలాటపడుతున్నాయి.

పీసీల తహాలోనే స్మార్ట్‌ఫోన్‌ల పనితీరు ఉండటంతో.. దీనికి క్రేజ్ బాగా పెరిగింది. దీంతో సత్వరమే మేలుకోకపోతే.. సెల్‌ఫోన్ తయారీ దార్లే పీసీ తరహాలో మరింత అధునాతమైన మొబైల్ ఫోన్ తయారు చేయడం ప్రారంభించేస్తాయనే భయం కంప్యూటర్ తయారీ సంస్థలకు పుట్టుకుందని విశ్లేషకులు అంటున్నారు.

మొబైల్ రంగంలోకి రానున్న కంపెనీలు...
మరిన్ని ఆప్షన్‌లు గల స్మార్ట్‌ఫోన్‌తో ఈ ఏడాది మొబైల్ మార్కెట్లోకి అడుగిడబోతోంది ప్రముఖ పీసీ తయారీ సంస్థ ఏసర్ కంపెనీ. ఎనిమిది రకాల సరికొత్త మోడళ్లతో ముందుకు రానున్నట్లు ఇప్పటికే ఏసర్ ప్రకటించింది కూడా. అలాగే మరో ప్రముఖ పీసీ తయారీ దిగ్గజం డెల్ కూడా ప్రోటోటైప్ రకం ఫోన్‌లపై పనిచేస్తోందని వార్తలు వస్తున్నాయి.

నోట్‌బుక్‌ల పేరిట తొలిసారిగా ఆల్ట్రాపోర్టబుల్ ల్యాప్‌టాప్‌ మార్కెట్లోకి విడుదల చేసిన సంస్థ అసుస్‌టెక్ కూడా త్వరలో స్మార్ట్‌ఫోన్‌లతో మొబైల్ వ్యాపారంలోకి అడుగిడనుంది. రెండు నెలల క్రితం బార్సిలోనాలో జరిగిన వరల్డ్ మొబైల్ కాన్ఫరెన్స్‌లో ఏసర్ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గియాన్‌ఫ్రాంకో లాన్సీ మాట్లాడారు.

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఎంతో ప్రత్యేకమైనదిగా ఎదుగుతోందని తెలిపారు. అదలా ఉంచితే ప్రపంచంలో చిప్ తయారీ దిగ్గజంగా ఉన్న ఇంటెల్ కంపెనీ కూడా ఇటీవలే సెల్‌ఫోన్ తయారీ సంస్థ అయిన ఎల్‌జీ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇవన్నీ ఎలా ఉన్నా... వినియోగదారులకు మాత్రం పండగే అని చెప్పాలి. ఎందుకంటే ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల అభిరుచుకులకు అనుగుణంగా అనేక ప్రముఖ కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయనున్నాయి. అందునా కంప్యూటర్ తయారీ కంపెనీలు మొబైల్ రంగంలో తమ ఉనికిని చాటుకునేందుకు చేసే ప్రయత్నంలో కంపెనీల మధ్య విపరీతమైన పోటీతో దీని ధర కూడా చాలా వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండవచ్చని అంచనా.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అక్టోబరు 31వ తేదీన పెళ్లి చేసుకుంటావా? ప్రియురాలికి సినీ దర్శకుడు ప్రపోజ్ (Video)

'ఎన్నో బాయ్‌ఫ్రెండ్' అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు : శృతిహాసన్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల కిష్కింధపురి ఫస్ట్ లుక్

Sridevi: ఆరోజునే 3డీలోనూ జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్

SS Rajamouli: నా ఎక్స్పెక్ట్ కు మించి నాని చాలా ముందుకు వెళ్లిపోయాడు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

Show comments