Webdunia - Bharat's app for daily news and videos

Install App

జర్మనీపై భారతీయ ఐటి కంపెనీల చూపు

Webdunia
శనివారం, 30 ఆగస్టు 2008 (14:09 IST)
ఇంతవరకు అమెరికా కార్పొరేట్ సంస్థలకు తక్కువ వ్యయంతో సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌లను అందించడంతోటే భారతీయ ఐటి కంపెనీలు సరిపెట్టుకుంటూ వస్తున్నాయని జగమెరిగిన సత్యం. అయితే అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించిన నేపథ్యంలో సాపేక్షంగా చూస్తే ఇంకా విస్తరించని యూరోపియన్ మార్కెట్‌వైపు భారతీయ కంపెనీలు చూపు సారిస్తున్నాయి.

భారతీయ ఐటి కంపెనీల సామర్థ్యాన్ని పసిగట్టిన నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా వంటి జర్మనీలోని రాష్ట్రాలు తమ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానిస్తున్నాయి.చిన్న మరియు మధ్య తరహా భారతీయ ఐటి సంస్థలు జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా ప్రాంతంలో గ్లోబల్ డెలివరీ కేంద్రాలను నెలకొల్పాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం మరియు మదుపుదారులు ఆహ్వానిస్తున్నారు.

ప్రభుత్వంతో సన్నిహితంగా పనిచేసే ఎన్‌ఆర్‌డబ్ల్యూఇన్‌వెస్ట్ గ్రూప్ తమ వ్యాపారావసరాలకు సరిపోయే చిన్న చిన్న జర్మన్ సంస్థలను కైవసం చేసుకోవచ్చని భారతీయ ఎస్ఎమ్ఇలను ఆహ్వానం పంపింది. జర్మనీలోని 16 సమాఖ్య రాష్ట్రాలలో ఎన్‌ఆర్‌డబ్ల్యూ ఒకటి దీని చుట్టూ కోలోన్, డోర్టమొండ్, డస్సెల్‌డ్రోఫ్ వంటి పెద్ద నగరాలు ప్రముఖ టెక్నాలజీ మరియు టెలికామ్ సంస్థల హబ్‌లుగా ఉన్నాయి.

పైగా, 530 బిలియన్ యూరోలతో జర్మనీ స్థూల దేశీయోత్పత్తికి అతి పెద్ద దోహదకారిగా ఈ రాష్ట్రం పేరొందింది. భారతీయ కంపెనీలు ఇక్కడ శాఖలు తెరిచినట్లయితే స్థానికులకు ఉద్యోగాలు లభ్యమవుతాయని ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

భారతీయ కంపెనీలు ఇక్కడ సృష్టించే ఉద్యోగాల సంఖ్య ప్రాతిపదికన పన్ను రాయితీలను కూడా కల్పిస్తామని ఎన్‌ఆర్‌డబ్ల్యూఇన్‌వెస్ట్ గ్రూప్ హామీ ఇస్తోంది. స్థానికులకు ఉద్యోగాలు సృష్టించగల సంస్థలకు కంపెనీ పెట్టుబడిలో 30 శాతం వరకు వెనక్కు ఇస్తామని ఆశ చూపుతోంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో దాదాపు వంద భారతీయ సంస్థలు పనిచేస్తున్నాయి.

వీటిలో 45 సంస్థలు ఐటి మరియు ఐటీఎస్ సంస్థలే. మిగతావి మాన్యుఫ్యాక్చరీ మరియు సర్వీస్ ప్లేయర్లు. కాగా, డస్సెల్‌డోర్ఫ్ ప్రాంతంలో నోకియా-సీమెన్స్ కోసం పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని టిసిఎస్ ఇటీవలే పొందింది. జర్మనీలో సంస్థలను కొనుగోలు చేసిన మొట్టమొదటి సంస్థల్లో టిసిఎస్ ఒకటిగా రికార్డు కెక్కింది.

గత రెండు సంవత్సరాల్లో విప్రో మరియు టెక్ మహీంద్రా తదితర ఐటి సేవా సంస్థలు కూడా ఈ రాష్ట్రంలో తమ కేంద్రాలను తెరిచాయి. మొత్తం మీద భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థల గాలి దిశ మార్చి జర్మనీవైపుకు పయనమవుతున్నట్లుంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

Show comments