Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలంపిక్ సమయంలో పెరిగిన వెబ్‌ట్రాఫిక్

Webdunia
శుక్రవారం, 3 అక్టోబరు 2008 (14:32 IST)
అమెరికా కావచ్చు... ఆస్ట్రేలియా కావచ్చు... ఆటలంటే ఎవరికి ఆసక్తి ఉండదు చెప్పండి... అందులోనూ ఒలంపిక్స్ అంటే మరీనూ... ప్రత్యక్షంగా చూడలేక పోయినా... సమాచార సాధానాల ద్వారా తెలుసుకోవాలని ప్రయత్నం చేయని క్రీడాభిమానులుండరేమో... అందుకే కాబోలు ఆగస్టు నెలలో అమెరికాలో వెబ్‌ట్రాఫిక్ పెరిగిపోయింది.

అంతా ఇంతా కాదు ఏకంగా 26 శాతం బ్రౌజింగ్ పెరిగిందంటే ఆటల పట్ల అక్కడ ఎంత ఉత్సాహం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూఎస్ స్పోర్ట్స్ వెబ్‌సైట్ పరుగులు పెట్టింది. ఆ వెబ్‌సైట్ చూసే వారి సంఖ్య మామూలుగా 33.4 మిలియన్లు ఉంటుంది.

ఇది సాధారణ రోజుల సంగతి. బీజింగ్లో ఒలంపిక్స్ జరిగిన ఆగస్టు నెల రావడంతో అది కాస్త 42.3 మిలియన్లకు చేరుకుంది. ఈ విషయాన్ని వెబ్‌సైట్ ప్రతినిధి నిల్సన్ కో తెలిపారు. ఆ వెబ్‌సైట్ ఆగస్టు నెలలో రౌండ్ ది క్లాక్ వార్తలు, ఫలితాలు, వీడియోలను అందుబాటులోకి తెచ్చింది.

దీంతో 20 శాతం వరకూ బ్రౌజింగ్‌ పెరిగింది. బ్రౌజర్లు ఎక్కువ సమయం సైట్‌లో గడపడానికి ప్రయత్నం చేశారు. సరాసరి ప్రతి ఒక్కరూ 57 నిమిషాల 7 సెకన్లు గడిపారు. వివిధ అంశాలను ఈ సైట్ ద్వారా చూశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగుదనం ఉట్టిపడేలా పంచె కట్టులో బాలయ్య - పద్మభూషణ్ అవార్డు స్వీకరణ

నూతన టాలెంట్ తో మ్యూజిక‌ల్ డ్రామాగా నిల‌వే టీజ‌ర్ విడుద‌ల‌

సింగిల్ కథ కార్తీక్ చెప్తున్న రెండు గంటలు నవ్వుతూనే ఉన్నా: అల్లు అరవింద్

విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రంలో వీరసింహారెడ్డి ఫేమ్ విజయ్ కుమార్

సమంతకు గుడికట్టించిన వీరాభిమాని (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Show comments