Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపిల్ నుంచి రెటీనా డిస్‌ప్లేతో కొత్త మ్యాక్‌బుక్ ప్రొ

Webdunia
సోమవారం, 30 జులై 2012 (20:19 IST)
ఆపిల్ మరోసారి తన పేరు నిరూపించుకున్నది. రెటీనా డిస్ ప్లేతో 'మ్యాక్ బుక్ ప్రొ'ను చూస్తే ఆపిల్ మరోసారి నాణ్యమైన ఉత్పత్తి ఎలా ఉంటుందో అర్థమవుతుంది. ఐ - పాపింగ్ ఫీచర్లతో 5.1 మిలియన్ పిక్జల్స్ రెటీనా డిస్ ప్లే సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఈ మ్యాక్ బుక్ ప్రొతో ఆపిల్ మరోసారి పోర్టబుల్ టెక్నాలజీలో తన సత్తా ఏమిటో నిరూపించుకోవడమే కాక ఆసక్తిని రేకెత్తిస్తోంది. వివరాలు చూసేద్దాం రండి.
WD


ఇప్పటివరకూ ఇలాంటి రెటీనా డిస్‌ప్లేతో మనం చూసి ఉండకపోవచ్చు. ఇంతకుముందు మీరు చూడనటువంటి మీ అంచనాలకు ఎంతమాత్రం తీసిపోనట్లుగా మీరు ఊహించుకున్నంత ప్రదర్శనతో మీ ముందుకు వచ్చింది. 15.4 అంగుళాల స్క్రీన్‌తో సుమారు 5 మిలియన్ పిక్జల్స్‌తో అత్యంత అధునాతనంగా తయారు చేయబడిన ఈ పరికరంలోని ఒక్కో పిక్జల్స్‌ను వీక్షించాలంటే దుర్లభం. సాధారణ మ్యాక్‌బుక్ ప్రొ కంటే దీని కాంట్రాస్ట్ 29 రెట్లు అధికంగా ఉంటుంది. అంతేకాదు చిత్రం స్పష్టంగానూ రంగులు రిచ్ గానూ మ్యాక్‌బుక్ ప్రొ ఉంటుంది. ఐపీఎస్ టెక్నాలజీ కలిగిన దీని ద్వారా 178 డిగ్రీల వీక్షణా కోణం మీకు లభిస్తుంది.

ఆపిల్ ఏ విషయంలోనైనా కొన్ని పరిమితులకు లోబడి ఉత్పత్తిని అందిస్తుంది. 1440 x900 ప్రమాణస్థాయి రిజల్యూషన్ నుంచి, (15 అంగుళాల మ్యాక్ బుక్ ప్రొ), 2880 x1800 రిజల్యూషన్ వరకూ అందిస్తుంది. ఇక ఫ్లాష్ విషయానికి వస్తే, సెకన్ల వ్యవధిలోనే స్టార్ట్-అప్ అవడమే కాక చురుకుగా పనిచేస్తుంది. ఇందుకు అనుగుణంగా ఇందులో అప్లికేషన్లను ఇమడ్చటం జరిగింది. మరో అంశం ఏమిటంటే, పెద్ద పెద్ద ఫైళ్లు, ఫోటో లైబ్రరీలను నిల్వ చేసుకునేందకు అదనంగా 768 GB ఫ్లాష్ స్టోరీజి ఇవ్వబడింది. ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

రెటీనా డిస్‌ప్లేతో కూడిన ఆపిల్ మ్యాక్ బుక్ ప్రొ సంతృప్తికరమైన బ్యాటరీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ 7 గంటలకు పైగానే పరికరానికి మద్దతు ఇస్తుంది. 30 రోజుల స్టాండ్ బై టైమ్‌తో, 95-వాట్లతో కూడిన బ్యాటరీ 1000 పూర్తిస్థాయి ఛార్జింగ్‌ను మీకు అందిస్తుంది. అంతేకాదు ఇది స్లీపింగ్ మోడ్‌లో ఉన్నప్పటికీ మీకు వచ్చే మెయిళ్లను లేదా క్యాలెండర్ ఇన్విటేషన్లను యధావిధిగా రిసీవ్ చేసుకుంటుంది. 17 ఇంటెల్ కోర్, హై స్పీడ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1600 MHz మెమొరీతోనూ 16 GB లైటింగ్ స్పీడ్‌ను కలిగి ఉంటుంది. ఆన్‌స్క్రీన్‌లో గ్రాఫిక్స్‌ను పొందేందుకు ఈ కొత్త మ్యాక్ బుక్ నెక్ట్స్ జనరేషన్ NVIDIA గ్రాఫిక్స్ సమర్థతను కలిగి ఉంది.

ఈ పరికరం మ్యాక్ బుక్ ఎయిర్‌లైన్ కంటే అంగుళంలో మూడువందలవ వంతు మందంతోనూ మరియు 4.46 పౌండ్ల బరువుతోనూ ఉంటుంది. ఆపిల్ నుంచి వచ్చిన ఈ మ్యాక్ బుక్ చూసేందుకు ఆకర్షణీయంగానూ, డిజైనింగ్‌కు ప్రాధాన్యతనిచ్చేదిగానూ తీర్చిదిద్దడం జరిగింది.

బయట ఎంత శబ్దంగా ఉన్నా దీనికున్న డ్యూయల్ మైక్రోఫోన్లు పరికరంలో మనం వినదలుచుకున్న శబ్దాన్ని స్పష్టంగా వినవచ్చు. అంతేకాదు మీ స్వరం స్పష్టంగా ఉన్నదివున్నట్లుగా రికార్డ్ చేసేందుకు అవసరమైన ఉపకరణాలను ఇందులో జోడించడం జరిగింది. నవీనీకరించబడిన సాప్ట్‌వేర్ ఈ కొత్త మ్యాక్ బుక్‌ను మరింత సమర్థవంతంగానూ, రెటీనా డిస్‌ప్లే స్పష్టంగానూ ఉండేట్లు చేస్తుంది.

ఇన్ని ప్రత్యేకతలు కలిగిన మ్యాక్ బుక్ రెటీన నాణ్యమైన డిస్ ప్లేను అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వినియోగదారులకు ఎల్లప్పుడూ ఉత్తమమైన, నాణ్యమైన ఉత్పత్తులను అందించే ఆపిల్ ఈసారి కూడా అదే అంకితభావంతో వచ్చింది. ఐతే, ఈ పరికరం కొంతమందికి కాస్త ఖరీదు ఎక్కువగా ఉన్నదని అనిపించవచ్చు. అయితే మెయింట్ నెన్స్ ఖర్చులు, రిపెయిర్లు, బ్యాటరీ తదితర సౌలభ్యాలను చూసినప్పుడు ఈ రేటు పెద్దగా అనిపించదు. చిట్టచివరిగా చెప్పాలంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను బట్టి మీరు రెటీనా డిస్‌ప్లేతో కూడిన కొత్త మ్యాక్ బుక్ ప్రొను కొనుగోలు చేయగలరో లేదో నిర్ణయించుకోవచ్చు.

WD
జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లను కలిగి షాపింగ్ పల్స్ తెలిసిన రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లో ఈ ఉత్పత్తులు లభిస్తాయి. ఆపిల్ ఉత్పత్తుల కోసం రిలయన్స్ డిజిటల్ ప్రత్యేకంగా ఐ స్టోర్‌ను తెరిచింది. ఉత్పత్తులకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు ఫేస్ బుక్ ను చూడవచ్చు. అంతేకాదు ఈ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని మీ స్నేహితులకు ట్విట్టర్ ద్వారా తెలుపవచ్చు. ఇంకా వివిధ ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని యూ ట్యూబ్‌ ను వీక్షించి తెలుసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments