Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేస్తున్నారా.. అయితే ఈ చిట్కాలు పాటించండి!

Webdunia
శుక్రవారం, 19 ఏప్రియల్ 2013 (17:09 IST)
File
FILE
మారుతున్న కాలానికి అనుగుణంగా బ్యాంకు ఖాతాదారులు కూడా తమ వ్యక్తిగత బ్యాంకు పనుల కోసం బ్యాంకుకు వెళ్లకుండా ఇంట్లోనే పనులు చక్కబెట్టుకుంటున్నారు. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు జమ చేయడం, వివిధ రకాల బిల్లులు చెల్లించడం, చెక్‌బుక్‌ రిక్వెస్ట్, చెక్‌ పేమెంట్స్ నిలుపుదల, ఫిక్స్‌డ్ డిపాజిట్ వేయడం తదితర పనులను ఇంట్లో నుంచి పూర్తి చేస్తున్నారు. ఇదేలా సాధ్యమని అనుకుంటున్నారు. సింపుల్. ఆన్‌లైన్ బ్యాంకింగ్‌ విధానాన్ని వినియోగించడం వల్ల సాధ్యపడుతుంది.

అయితే ఈ బ్యాంకింగ్ విధానాన్ని ఎంచుకున్న తర్వాత కొన్ని సూచనలు, చిట్కాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. అవేంటంటే.. పాస్‌వర్డ్‌లు గుర్తు పెట్టుకోవాలంటే వారంలో కనీసం ఒక్కసారైనా లాగిన్ కావాలి. ఎక్కువ ఖాతాలు.. ఎక్కువ పాస్‌వర్డ్‌లు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక నోటుబుక్‌లో రాసిపెట్టి, దాన్ని మీ ఆధీనంలో ఉండేలా భద్రంగా దాచుకోవాలి.

ముఖ్యంగా.. మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన సీక్రెట్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకోరాదు. అలాగే, ఫేక్ ఫోన్స్, ఫేక్ మెయిల్స్‌లలో మీ బ్యాంకు ఖాతా వివరాలు, లాగిన్ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోద్దు. ఆన్‌లైన్‌లో ఆర్థిక లావాదేవీలు జరిపే వెబ్‌సైట్ అడ్రస్ హెచ్‌టీటీపీఎస్ అక్షరంతో మొదలు కావాలి.

మామూలు సైట్లు చివర్లో ఉండే ఎస్ అక్షరం భద్రతకు సూచిక. ఆన్‌లైన్‌లో విఫలైన ట్రాన్సాక్షన్లను పరిష్కరించుకోవడానికి బ్యాంకుకు వెళ్లనక్కర్లేదు. మెయిల్స్ లేదా ఫోన్ బ్యాంకింగ్ ద్వారా పరిష్కరించుకోవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Show comments