Webdunia - Bharat's app for daily news and videos

Install App

4జీ లేకపోయినా.. రిలయన్స్ జియో సేవలు... 'జియోఫి' పేరుతో అందుబాటులోకి

దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న కంపెనీ రిలయన్స్ జియో. ఈ కంపెనీ సేవలు ప్రస్తుతం కేవలం 4జి స్మార్ట్ ఫోన్లలోనే అందుబాటులో ఉన్నాయి. ఇతర మొబైల్స్ (3జీ, 2జీ, బేసిక్ మొబైల్స్) వినియోగదారులు ఈ సేవలు ప

Webdunia
సోమవారం, 26 డిశెంబరు 2016 (14:43 IST)
దేశ టెలికాం రంగంలో సంచలనం సృష్టిస్తున్న కంపెనీ రిలయన్స్ జియో. ఈ కంపెనీ సేవలు ప్రస్తుతం కేవలం 4జి స్మార్ట్ ఫోన్లలోనే అందుబాటులో ఉన్నాయి. ఇతర మొబైల్స్ (3జీ, 2జీ, బేసిక్ మొబైల్స్) వినియోగదారులు ఈ సేవలు పొందలేని పరిస్థితి నెలకొనివుంది. దీంతో కోటాను కోట్ల మంది జియో ఉచిత వాయిస్ కాల్స్, ఫ్రీ డేటా సేవలను పొంద
లేక పోతున్నారు. దీన్ని నివృత్తి చేసేందుకు రిలయన్స్ జియో సరికొత్త పోర్టబుల్ వాయిస్ ప్లస్ డేటా వాయిస్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. దీని పేరు జియోఫి వైఫై రౌటర్.
 
ఇది ఆన్‌లైన్‌లోనేకాకుండా మల్టీబ్రాండ్ ఔట్‌లెట్స్‌లతోపాటు.. ఏజియో డాట్ కామ్ వెబ్‌సైట్‌లో కూడా పొందవచ్చు. ఈ ఆప్షన్ కింద జియో సిమ్ జియోఫితో వస్తుంది. ఒక్కసారి ఈ జియో సిమ్ యాక్టివేట్ అయ్యిందంటే... మీరు హాట్‌స్పాట్‌ ద్వారా ఇంటర్నెట్ సేవలను పలు డివైస్‌లకు అనుసంధానం చేసుకుని వాడుకోవచ్చు. జియోఫిని కనీసం 10 నుంచి 32 డివైస్‌ల వరకు అనుసంధానం చేసుకోవచ్చు. అంటే.. ఒక కుటుంబంలోని సభ్యులు లేదా చిన్నపాటి కంపెనీ సభ్యులు ఒకే జియోఫి ద్వారా సేవలను పొందవచ్చు. 
 
ఇకపోతే.. ఉచిత వాయిస్‌కాల్ విషయానికి వస్తే... తమ వద్ద ఉన్న 3జి లేదా 2జి ఫోన్లలో గూగుల్ ప్లే స్టోర్‌ ద్వారా జియో 4జి అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత జియోఫి నెట్‌వర్క్‌కు అనుసంధానం చేసుకుంటే చాలు. ఒకవేళ వినియోగదారుడు జియో4జీవాయిస్‌ను డీఫాల్ట్ ఆప్షన్‌గా ఎంచుకున్నట్టయితే హైస్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ వాయిస్ అండ్ వీడియా కాల్స్‌ను పొందవచ్చు. అలాగే, లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్‌లను కూడా ఉచితంగా పంపుకోవచ్చు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments