Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కస్టమర్లకు షాక్.. భారీ పెరగనున్న టారిఫ్స్

Webdunia
మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (16:14 IST)
రిలయన్స్ జియో తన కస్టమర్లకు తేరుకోలేని షాకివ్వనుంది. దేశంలో అత్యంత చౌక ధరలకు డేటా సేవలు అందుబాటులోకి తెచ్చిన రిలయన్స్ జియో.. త్వరలోనే టారిఫ్స్ రేట్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఫైబర్, టవర్ ఆస్తులను విడదీసేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్స్ (ఎస్పీవీ)తో దీర్ఘకాల సామర్థ్య లీజింగ్ ఒప్పందాల కారణంగా ఏటా రూ.9,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని ప్రత్యర్థి కంపెనీలైన వోడాఫోన్ ఐడియా(వీఐఎల్), భారతి ఎయిర్‌టెల్ పెట్టుబడుల రూపంలో సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కానీ, రిలయన్స్ జియో మాత్రం కస్టమర్లపై భారం మోపాలని భావిస్తోంది. 
 
'ఆరు నుంచి నెలల క్రితం కంటే ఇపుడు జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది ఇతర కంపెనీలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా వోడాఫోన్ ఐడియాకి' అని యుఎస్ బ్రోకరేజ్ సంస్థ జెపి మోర్గాన్ చెప్పింది. 
 
వోడాఫోన్ ఐడియా, ఎయిర్‌టెల్ పెట్టుబడులు పెంచుకొనే ప్రణాళికలపై మదుపరుల విశ్వాసం పెరుగుతున్నట్టు సంస్థ తెలిపింది. ఆయా సంస్థల పోరాట సామర్థ్యం సూచనప్రాయంగా తెలుస్తుండటంతో జియో తన ధరలపై పునరాలోచించే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబోయే రెండు మూడేళ్ల పాటు తన బ్యాలెన్స్ షీట్‌లో పెట్టుబడులను పెంచుకుంటూ పోగలదా? అనేది కీలకం కానుంది. 
 
దేశవ్యాప్తంగా 4జీ సామర్థ్యం పెంచుకొని జియోతో అమీతుమీ తేల్చుకోవాలని ప్రత్యర్థి కంపెనీలు అనుకుంటున్నాయి. అయితే జియో యాజమాన్యం మాత్రం ప్రస్తుత టారిఫ్స్ మార్చే యోచనే లేదని గతవారం పునరుద్ఘాటించింది. సబ్‌‌స్క్రైబర్ మార్కెట్ షేర్‌ని పెంచుకోవడంపైనే దృష్టి పెట్టినట్టు చెప్పింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments