Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో మరో క్రేజీ ఫీచర్‌.. త్వరలో వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా...

సోషల్ మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌ మరో చక్కని ఫీచర్‌ను తన యూజర్లకు అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ కూడా చేయవచ్చు. ఇప్పటివరకు వాయిస్‌ కాల్‌ సదుపాయాన్ని అందిస్తూ వచ్చిన వ

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (15:38 IST)
సోషల్ మెసేజింగ్‌ దిగ్గజం వాట్సాప్‌ మరో చక్కని ఫీచర్‌ను తన యూజర్లకు అందించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే వాట్సాప్‌లో వీడియో కాల్స్‌ కూడా చేయవచ్చు. ఇప్పటివరకు వాయిస్‌ కాల్‌ సదుపాయాన్ని అందిస్తూ వచ్చిన వాట్సాప్‌ ఇకపై వీడియోకాల్స్‌ చేసుకునే అవకాశాన్ని కూడా కల్పించనుంది.
 
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్‌ పరిశోధనలో ఉంది. 'బేటా' మోడ్‌కు సంబంధించి విండోస్‌ ఫోన్‌, ఐఫోన్‌లలో ఇప్పటికే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకునిరాగా, త్వరలోనే ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ వీడియో కాల్స్‌ ఆప్షన్‌ తీసుకొచ్చే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
వాట్సాప్‌లో వాయిస్‌ కాల్ ఆప్షన్‌తోపాటు దాని పక్కన వీడియో కాల్‌ ఆప్షన్‌ కూడా ఉంది. వాట్సాప్‌లో ఇప్పటివరకు కాల్స్‌ మాత్రమే చేసుకున్న యూజర్లు... వీడియో కాల్‌ అందుబాటులోకి వస్తే ఒకరినొకరు చూసుకుంటూ మాట్లాడుకోవచ్చు. ముందు, వెనుక కెమెరాలతో ఈ ఫీచర్‌ను వాడుకునే అవకాశం కల్పించారు. 
 
అవసరం లేకుంటే మ్యూట్‌ చేసుకొనే సదుపాయం, మిస్డ్‌కాల్ వస్తే తెలియజేసే సౌకర్యం కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తోంది. వాట్సాప్‌ గత ఫీచర్ల మాదిరిగానే ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చుకోవడానికి యూజర్లు గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం