వాట్సాప్‌లో కొత్త పీచర్.. సెట్టింగ్స్‌లోనూ సెర్చ్ ఆప్షన్...

Webdunia
గురువారం, 13 ఏప్రియల్ 2023 (09:29 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంది. ముఖ్యంగా, ఆండ్రాయిడ్ యూజర్లకు కోసం ఇప్పటికే అనేక ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్.. తాజాగా మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకునిరానుంది. అయితే, వాట్సాప్ సెట్టింగ్స్‌లనూ ఓ సెర్చ్ ఫీచర్‌ను తీసుకుని రానుంది. అయితే, ప్రస్తుతానికి ఇది ప్రయోగ దశలోనేవుంది. 
 
అతి తక్కువమంది యూజర్లకు మాత్రం ఈ సెర్చ్ ఆపరేషన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మిగిలిన యూజర్లకు కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ సెర్చ్ బార్ సాయంతో సెట్టింగ్స్‌ విభాగంలో మనకు కావాల్సిన అంశాన్ని నేరుగా వెదికే వెసులుబాటు ఉంటుంది. బీటా వెర్షన్‌లో ఈ సెర్చ్‌బార్‌కు సంబంధించిన ఐకాన్ దర్శనమిస్తుంది. ఈ ఐకాన్ ఉంటే సెట్టింగ్స్‌లోనూ సెర్చ్ చేయొచ్చు. 
 
కాగా, ఒకే వాట్సాప్ ఖాతాను రెండు మూడు స్మార్ట్ ఫోన్లలో ఉపయోగించుకునే ఫీచర్‌పై కూడా వాట్సాప్ టెక్నికల్ నిపుణులు కసరత్తులు చేస్తున్నారు. దీన్నే కంపానియన్ మోడ్‌గా పిలుస్తారు. ప్రధాన డివైస్‌లో ఉండే వాట్సాప్ ఖాతాను ఒకటి కంటే ఎక్కువ డివైస్‌లలో యాక్సెస్ చేసుకునేందుకు ఈ కంపానియన్ మోడ్ దోహదపడుతుంది. ఫలితంగా వాట్సాప్‌ను ఒకటి కంటే ఎక్కువ వాట్సాప్‌లలో ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రిష ఓ పరాన్నజీవి, ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం లేదు: సుచిత్ర

Manchu Manoj: బండి భగీరథ్‌ పై పోక్సో కేసు తీవ్రంగా కలవరపరిచింది : మంచు మనోజ్

విజయ్ జీవితంలోకి కొందరు పరాన్నా జీవులుగా ప్రవేశించారు : సుచిత్ర

Ali: టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం ప్రారంభం

Nihal: వినూత్న కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సందిగ్ధం డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments