వాట్సాప్ నుంచి సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీమియం ప్లాన్.. ఫీచర్స్ ఇవే

సెల్వి
శనివారం, 7 మార్చి 2026 (12:04 IST)
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీమియం ప్లాన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. కస్టమర్లకు మరింత పర్సనలైజేషన్ సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ఈ ఫీచర్‌ను రూపొందిస్తుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న కస్టమర్లు యాప్‌ను తమకు నచ్చిన విధంగా మార్చుకోవచ్చు. 
 
ముఖ్యంగా యాప్ ఐకాన్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. 14 రకాల ఐకాన్ స్టైల్స్‌ను వాట్సాఫ్ అభివృద్ధి చేస్తోంది. ఫోన్‌లో ఉండే రింగ్‌టోన్లు, అలర్ట్ టోన్స్ కాకుండా వాట్సాప్ ప్లస్ ప్రత్యేకంగా రింగ్‌టోన్‌లను కస్టమర్లకు అందించనున్నట్లు సమాచారం. 
 
దీనివల్ల ఇతర యాప్‌ల నోటిఫికేషన్లతో గందరగోళం ఏర్పడకుండా ఈజీగా వాట్సాప్ మెసేజ్ అలర్ట్‌లను గుర్తించవచ్చు. అలాగే యాప్ థీమ్, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను కూడా నచ్చిన రంగుల్లోకి మార్చుకోవచ్చు. 
 
ప్రస్తుతం వినియోగిస్తున్న వాట్సాప్ యాప్‌లో గరిష్టంగా మూడు చాట్‌లను మాత్రమే పిన్ చేయడానికి అవకాశం ఉంది. కానీ వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే 20 చాట్‌ల వరకు పిన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Wala 2: మంచి సినిమాకి ఎలాంటి సరిహద్దులు ఉండవు : సాయి దుర్గతేజ్, నిఖిల్

Tamil movies hava::వేసవిలో తెలుగు భారీ చిత్రాలు లేకపోవడంతో తమిళ చిత్రాలదే హవా

Suri: మండాడి షూటింగ్ పూర్తి - శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు

King of Pop Review: కింగ్ ఆఫ్ పాప్ నెటిజన్ల రివ్యూ - మైఖేల్ జాక్సన్ బయోపిక్ ను అల్లు అర్జున్ చేస్తాడా?

కన్న మూవీ పరిశ్రమలో నిలిచిపోతుంది : హీరో కార్తిక్ శివన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మజ్జిగ తాగితే ఏమవుతుంది?

summer herbal drinks, వేసవిలో ఆరోగ్యకర హెర్బల్ పానీయాలు

ప్రపంచ మలేరియా దినోత్సవం- గర్భధారణ సమయంలో మలేరియా.. గుర్తించకపోతే...?

వేసవిలో కొబ్బరి నీరు ఆరోగ్య ప్రయోజనాలు

పార్కిన్సన్స్ రోగుల కోసం మెడ్‌ట్రానిక్ అడాప్టివ్ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సిస్టమ్‌

తర్వాతి కథనం
Show comments