వాట్సాప్‌ నుంచి పేమెంట్స్ కొత్త ఫీచర్..

సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో ఈ-పేమెంట్స్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌కు చెందిన బీటా వెర్షన్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్

Webdunia
శనివారం, 10 ఫిబ్రవరి 2018 (13:24 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన వాట్సాప్‌లో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌లో ఈ-పేమెంట్స్ ఆప్షన్స్ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌కు చెందిన బీటా వెర్షన్ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్‌లపై వాడే యూజర్లకు వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈ ఫీచర్ ద్వారా సదరు అకౌంట్ నుంచి నేరుగా నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకునే సౌలభ్యం వుంటుంది. దీనికోసం యూజర్లు యూపీఐ యాప్ ద్వారా లేదా బ్యాంక్ వెబ్ సైట్ ద్వారా యూపీఐ అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాల్సి వుంటుంది. కానీ నగదు పంపేవారికి స్వీకరించే వారిద్దరికీ కచ్చితంగా వాట్సాప్ పేమెంట్స్ ఫీచర్ ఉండి తీరాలని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
ఇప్పటికే గూగుల్ యూపీఐ ఆధారిత పేమెంట్స్ ఆప్‌లను ప్రవేశపెట్టింది. గూగుల్ టెజ్ ప్రస్తుతం బాగా ప్రాచుర్యమవుతోంది. ఈ టెజ్ ద్వారా 7.5 మిలియన్ యూజర్లు నగదు బదిలీ కోసం ఈ యాప్‌ను వినియోగిస్తున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ప్రారంభమైన ఐదు వారాల్లోనే భారీ వినియోగదారులను టెజ్ కలిగివుందని సుందర్ పిచాయ్ వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments