Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. వీడియో స్ట్రీమింగ్ అండ్.. జిప్ ఫార్మాట్

తమ నెటిజన్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా వీడియో స్ట్రీమింగ్ అండ్ జిప్ ఫార్మాట్‌లు ఉన్నాయి. జిప్ ఫార్మాట్ ద్వారా చిత్రా

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2016 (16:13 IST)
తమ నెటిజన్ల కోసం ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్ మరో రెండు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా వీడియో స్ట్రీమింగ్ అండ్ జిప్ ఫార్మాట్‌లు ఉన్నాయి. జిప్ ఫార్మాట్ ద్వారా చిత్రాలు పంపించుకునే వెసులుబాటు ఉంది. గతంలో ఈ రెండు బీటా వినియోగదారులకు మాత్రమే ఈ సదుపాయాలు అందుబాటులో ఉండేవి.
 
ఇప్పటివరకు ఎవరైనా పంపిన వీడియోలను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్లే చేసుకునే వెసులుబాటు మాత్రమే ఉండేది. తాజాగా వచ్చిన ఫీచర్‌ ద్వారా ఇకపై వీడియోను నేరుగా ప్లే చేయొచ్చు. లేదనుకుంటే డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటునూ వాట్సాప్‌ అందిస్తోంది. వాట్సాప్‌ రెండో సదుపాయంతో ఇకపై 6 సెకండ్ల నిడివి గల వీడియోను జిఫ్‌ ఫార్మాట్‌ రూపంలో పంపించుకోవచ్చు.
 
పంపించే ముందు వాటిని మనకు కావాల్సిన సైజ్‌లో క్రాప్‌ చేసుకునే అవకాశం ఉంది. ఇతరులు పంపిన ఇటువంటి చిత్రాలు నేరుగా ఫోన్‌లో వాట్సాప్‌ డైరెక్టరీలోని యానిమేటెడ్‌ జిఫ్‌ ఇమేజెస్‌ ఫోల్డర్‌లో నిక్షిప్తమవుతాయి. ఈ రెండు సదుపాయాలను వాట్సాప్‌ తాజా అప్‌డేట్‌లో అందుబాటులోకి తెచ్చింది.

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments