వాట్సాప్‌ను ఇకపై ఇలా లాక్ చేసుకోవచ్చు.. ఇతరులు చూడకుండా..?

Webdunia
బుధవారం, 17 మే 2023 (11:15 IST)
ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ ప్రజలు ఉపయోగించే వాట్సాప్‌లో చాట్‌లను లాక్ చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ ప్రైవేట్ మెసేజింగ్, ఫోటో, వీడియో, డాక్యుమెంట్ షేరింగ్, గ్రూప్ డిస్కషన్, వీడియో కాలింగ్, పేమెంట్స్ వంటి అనేక ఫీచర్లను పరిచయం చేసింది. 
 
ఇదేవిధంగా వాట్సాప్ ఒక వ్యక్తితో చాట్‌లను లాక్ చేసే సదుపాయాన్ని కూడా ప్రవేశపెట్టింది. వాట్సాప్‌లో ఎవరూ చూడకూడదనుకునే వ్యక్తుల చాట్‌లను ఈ ఫీచర్ ద్వారా లాక్ చేసుకోవచ్చు. లాక్ చేయబడిన వ్యక్తి సందేశం పంపినప్పటికీ, అది నోటిఫికేషన్‌లో కనిపించదు.
 
వేలిముద్ర లేదా పాస్‌వర్డ్‌తో చాట్‌ని అన్‌లాక్ చేయవచ్చు కాబట్టి, ఆ వ్యక్తితో చేసిన చాట్‌ను మరెవరూ చూడలేరు. వాట్సాప్ వినియోగదారులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tollywood Exibitors war : ఎగ్జిబిటర్ల మధ్య వార్ - దిల్ రాజు మనుషులు బెదిరింపు !

Shruti Haasan: గ్రామస్తుల వింత పరిస్థితికి సింగ్ గీతం నుంచి ఏమైంది' సాంగ్

పోలీస్ కంప్లైంట్ లో కృష్ణ సినిమాల‌ను గుర్తు చేస్తూ ప్ర‌త్యేక‌ పాట‌

Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్

Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం

తర్వాతి కథనం
Show comments