Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూలై 6న వివో నుంచి ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్ ఫోన్లు: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులు కూడా?

బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్' ఫోన్లకు 2017 వేరియంట్లను జూలై ఆరో తేదీన విడుదల చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ ముందు భాగంలో ర

Webdunia
మంగళవారం, 27 జూన్ 2017 (19:39 IST)
బీజింగ్‌లో జరగనున్న ఓ ఈవెంట్‌లో వివో కొత్త ఫోన్లు విడుదల కానున్నాయి. వివోకు చెందిన ఎక్స్9ఎస్, ఎక్స్9ఎస్ ప్లస్' ఫోన్లకు 2017 వేరియంట్లను జూలై ఆరో తేదీన విడుదల చేయనుంది. ఈ రెండు ఫోన్లలోనూ ముందు భాగంలో రెండు సెల్ఫీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 
 
వివో నుంచి వేరియంట్ ఫోన్లు రెండింటిలోనూ యూజర్లకు ఆండ్రాయిడ్ 7.1 నూగట్ ఓఎస్ లభించనుంది. అలాగే వివో ఎక్స్9ఎస్ ప్లస్ 2017 ఫోన్‌లో 5.85 ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో పాటు 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 3950 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఉంటాయి. ఈ రెండింటినీ మెటల్ బాడీతో రూపొందించారు. రెండూ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉన్నాయి.
 
ఇదిలా ఉంటే, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్ ‌షిప్ హక్కులను వివో సొంతం చేసుకుంది. 2017 సీజన్‌తో ఒప్పందం ముగియడంతో బీసీసీఐ టైటిల్‌ స్పాన్సర్షిప్ హక్కుల కోసం వేలం నిర్వహించింది. ఈ వేలంలో వివో 2018 నుంచి 2022 వరకు రూ. 2199 కోట్లతో బిడ్‌ దాఖలు చేసింది. ఇది గత కాంట్రాక్టుతో పోలిస్తే 554 శాతం అధికం కావడం విశేషం.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: షూటింగ్ స్పాట్ లో ఎన్.టి.ఆర్.కు ప్రశాంత్ నీల్ కితాబు

విడుదలకు సిద్దమైన రాజేంద్ర ప్రసాద్, అర్చన చిత్రం షష్టి పూర్తి

పదవిలో ఉన్నవారు బూతులు మాట్లాడితే పవర్ కోల్పోవాలి : గడ్డం రమణారెడ్డి

Pawan Kalyan:, హరిహరవీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

మ్యాచ్ గెలిచిన విజయ్ దేవరకొండ - కింగ్డమ్ సాంగ్ రీల్ చేయాలంటూ రిక్వెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments