Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికన్లకు మేం ఉద్యోగాలిస్తాం.. ట్రంప్‌కు షాకిచ్చిన ఇన్ఫోసిస్.. 10 వేల జాబ్స్ సృష్టిస్తామని..?

భారత్‌లోని ఐటీ సంస్థలు తమ దేశ ఉద్యోగాలను కొల్లగొట్టుకుపోతున్నాయని, అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ అంటుంటే.. ఇన్ఫోసిస్ షాకిచ్చే ప్రకటన చేసింది. వచ్చే రెండేళ్లలో తాము కొత్తగా 10 వేల జాబ్స్ సృష్ట

Webdunia
గురువారం, 4 మే 2017 (13:04 IST)
వీసాల రద్దు, అవుట్ సోర్సింగ్‌కు బ్రేక్ వేయడం ద్వారా భారతీయులను అమెరికాలోని ప్రస్తుత సర్కారు దెబ్బకొట్టింది. స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా భారతీయులకు వ్యతిరేకంగా ట్రంప్ తీసుకునే నిర్ణయాల పట్ల దేశంలోని ఉన్నత వ్యాపారవేత్తలు ఫైర్ అవుతున్నారు. అమెరికా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలను విధించడంపై ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఘాటుగా స్పందించారు.
 
అమెరికా చర్యలకు ప్రతిగా భారత్ కూడా అదే రీతిలో స్పందించాలని  పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోష‌ల్ మీడియాలో అమెరికాకు చెందిన పాపుల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌లైన ఫేస్‌బుక్, గూగుల్, వాట్సప్‌లను నిషేధించాలని అభిప్రాయపడ్డారు.అప్పుడే అమెరికాకు భార‌త్ స‌త్తా తెలుస్తుందని ఉద్ఘాటించారు. 
 
ఈ నేపథ్యంలో భారత్‌లోని ఐటీ సంస్థలు తమ దేశ ఉద్యోగాలను కొల్లగొట్టుకుపోతున్నాయని, అమెరికన్లకు అన్యాయం జరుగుతోందని ట్రంప్ అంటుంటే.. ఇన్ఫోసిస్ షాకిచ్చే ప్రకటన చేసింది. వచ్చే రెండేళ్లలో తాము కొత్తగా 10 వేల జాబ్స్ సృష్టిస్తామని, అయితే ఈ ఉద్యోగాల్లో అంతా అమెరికన్లే ఉంటారని పేర్కొంది.
 
బెంగుళూరులోని ఇన్ఫోసిస్ సంస్థ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత ఆగస్టులో ఇండియానా పాలిస్‌లో యూఎస్ బేస్డ్ హబ్స్ ప్రారంభిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది నాటికి ఇండియానా సైట్‌లో 500 ఉద్యోగాలు కల్పిస్తామని, 2021 నాటికి ఇది 2 వేలకు పెరుగుతుందని ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ సిక్కా తెలిపారు. మేమిలా ఓ కొత్త సాంస్కృతిక సాన్నిహిత్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. కాగా ఈ ప్రకటనపై వైట్ హౌస్ హర్షం వ్యక్తం చేసింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిష్కింధపురి కోసం రెండు కోట్లతో సెట్, రేడియో వాయిస్ చుట్టూ జరిగే కథ : సాహు గారపాటి

Naresh: నాగ చైతన్య క్లాప్ తో నరేష్65 చిత్రం పూజా కార్యక్రమాలు

సైమా అవార్డ్స్ చిత్రం కల్కి, నటుడు అల్లు అర్జున్, క్రిటిక్స్ తేజ సజ్జా, సుకుమార్, ప్రశాంత్ వర్మ

Karthik: పురాణాల కథకు కల్పితమే మిరాయ్, కార్వాన్ లేకుండా షూట్ చేశాం : కార్తీక్ ఘట్టమనేని

రూ.9 కోట్ల బ‌డ్జెట్‌కు రూ.24.5 కోట్లు సాధించిన‌ కమిటీ కుర్రోళ్లు కు రెండు సైమా అవార్డులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

ఫ్లూ నుంచి రక్షణ కోసం ట్రైవాలెంట్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్‌ను విడుదల చేసిన జైడస్ వాక్సిఫ్లూ

మొక్కజొన్నలో వున్న పోషకాలు ఏమిటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments