Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాయ్ నిర్లక్ష్యం : 10లక్షల మంది ఇ-మెయిల్ ఐడీ వివరాలు బహిర్గతం!

Webdunia
సోమవారం, 27 ఏప్రియల్ 2015 (14:15 IST)
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) అధికారుల తీవ్ర నిర్లక్ష్యం సుమారు పది లక్షల మందికి పైగా వాడుతున్న వ్యక్తిగత ఇ-మెయిల్ ఐడీ వివరాలను బహిర్గతం చేసింది. నెట్ న్యూట్రాలిటీపై అభిప్రాయాలు కోరుతూ.. మార్చి 27న ట్రాయ్ శ్వేతపత్రాన్ని విడుదల చేయగా, తమ అభిప్రాయాలు తెలుపుతూ, 10 లక్షలకు పైగా ఇ-మెయిల్స్ వెల్లువలా వచ్చి పడ్డాయి. 
 
వ్యక్తులతో పాటు భారతీ ఎయిర్ టెల్, ఐడియా వంటి టెలికం సంస్థలు, సీఐఐ, అసోచామ్ వంటి ఇండస్ట్రీ బాడీలూ స్పందించి ఇంటర్నెట్ విషయంలో అన్ని కంపెనీలకూ ఒకే విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశాయి. 
 
అందరి మెయిల్స్ క్రోఢీకరించిన ట్రాయ్ ఒక నివేదికను తయారు చేస్తూ, తనకు మెయిల్స్ పంపిన అందరి వివరాలనూ, వారిచ్చిన సూచనలనూ అధికారిక వెబ్ సైట్లో ఉంచింది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 24 వరకూ వచ్చిన మెయిల్స్ వివరాలు అధికారికంగా వెబ్ సైట్లో తెలిపింది. ట్రాయ్ నిర్వాకంపై ఇప్పుడు దేశవ్యాప్త నిరసన వెల్లువెత్తుతోంది. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments