Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్లతో కాలం గడిపేవారికి చెక్.. సంబంధాలను మెరుగుపరిచే గూగుల్ యాప్..

సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో కుటుంబ సభ్యులను, బంధువులను పక్కనబెట్టి.. ప్రత్యేక ప్రపంచంలో విహరించే స్మార్ట్ గురువులకు బుద్ధి చెప్పే దిశగా కొత్త యాప్ లైన్లోకి వచ్చేసింది. వాట్సాఫ్, ఫేస్ బుక్ స

Webdunia
గురువారం, 17 నవంబరు 2016 (14:28 IST)
సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్ల ప్రభావంతో కుటుంబ సభ్యులను, బంధువులను పక్కనబెట్టి.. ప్రత్యేక ప్రపంచంలో విహరించే స్మార్ట్ గురువులకు బుద్ధి చెప్పే దిశగా కొత్త యాప్ లైన్లోకి వచ్చేసింది. వాట్సాఫ్, ఫేస్ బుక్ సందేశాలూ చూస్తూ.. వాటికి సమాధానాలిస్తూ స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడిపే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. మానవ సంబంధాలను బలోపేతం చేసేందుకు గాను టచ్డ్ రిలేషన్ మేనేజర్ యాప్ అనే సరికొత్త యాప్ వచ్చింది. 
 
మనుషుల మధ్య కొరవడే సంబంధాలను ఇది మెరుగుపరిచి స్నేహ సంబంధాలను పునాది వేస్తుంది. దీన్ని ఎలా కనిపెట్టాలంటే.. గూగుల్ సెర్జ్ ఇంజిన్‌లో టచ్డ్‌ (టీఓసీహెచ్‌‌డీ) అని టైప్‌చేస్తే చాలు ఆ యాప్‌ ప్రత్యక్షమవుతుంది. ఈ యాప్ గురించి వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ.. స్నేహితులు, సన్నిహితులతో నిరంతరం టచ్‌లో ఉండేలా ఇది ప్రోత్సహిస్తుంది. ప్రతి కాంటాక్టును ఈ యాప్ ఓ గ్రాఫ్ ద్వారా మెయింటైన్ చేస్తుంది. 
 
దీని ఇన్నర్ సర్కిల్ ద్వారా 25మందిని ఉచితంగా యాడ్ చేసుకోవచ్చు. అంతకుమించి ఎవరైనా ఉంటే నెలకు రూ.190 చొప్పున చెల్లించాలి. ప్రస్తుతానికి ఈ యాప్ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉంది. రోజుకు రెండు నోటిఫికేషన్ల ద్వారా కనీసం ఇద్దరితో కాంటాక్ట్ అయ్యేలా చేస్తుంది. ఈ స్మార్ట్ యాప్ ద్వారా కుటుంబం, స్నేహితులు, బంధువులతో కాంటాక్ట్ ద్వారా సంబంధాలు బలోపేతం అవుతాయని గూగుల్ తెలుపుతోంది. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments