Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొబైల్ ఫోన్లు పేలకుండా ఉండాలంటే ఏం చేయాలి...

ఈ మధ్య మొబైల్ ఫోన్స్ పేలిపోతున్నాయి. ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు.. జేబులో ఉన్న ఫోన్లు ఇలా వాటికి అవే పేలిపోతున్నాయి. కొంతమంది చేతుల్లో పేలగా కొంతమందికి జేబులో పెట్టుకుంటే పేలిపోతున్నాయి. దీంతో చాలామంది తీవ్రగాయాల పాలవుతున్నారు. కొంతమందైతే చనిపోతున్నారు.

Webdunia
శుక్రవారం, 22 సెప్టెంబరు 2017 (20:55 IST)
ఈ మధ్య మొబైల్ ఫోన్స్ పేలిపోతున్నాయి. ఛార్జింగ్ పెట్టిన ఫోన్లు.. జేబులో ఉన్న ఫోన్లు ఇలా వాటికి అవే పేలిపోతున్నాయి. కొంతమంది చేతుల్లో పేలగా కొంతమందికి జేబులో పెట్టుకుంటే పేలిపోతున్నాయి. దీంతో చాలామంది తీవ్రగాయాల పాలవుతున్నారు. కొంతమందైతే చనిపోతున్నారు. 
 
అసలు మొబైల్ పేలకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఎప్పుడైనా ఛార్జింగ్ 96 శాతం కంటే ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి. 20 శాతం కంటే తక్కువ ఉండకుండా ఛార్జ్ చెయ్యాలి. అలాగే మొబైల్‌కి పౌచ్ ఉంటే తీసేసి ఛార్జింగ్ పెట్టాలి. మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు హీట్‌గా ఉంటే 5 లేదా 10 నిమిషాల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆ తరువాత ఛార్జింగ్ పెట్టాలి. మొబైల్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు వైఫై, హాట్ స్పాట్, సాంగ్స్, నెట్, కాల్స్, గేమ్స్ పొరపాటున కూడా వాడకూడదు. మొబైల్‌కి వచ్చిన ఛార్జర్ పాడైతే మీ మొబైల్ కంపెనీ ఛార్జర్‌ని కొనుక్కుని వాడాలి. 100 రూపాయల కన్నా తక్కువ వచ్చే ఛార్జర్లను వాడకూడదు.
 
మీకు అవసరం లేని అప్లికేషన్స్ వెంటనే మొబైల్ ఫోన్స్ నుంచి తీసెయ్యాలి. కొన్ని గేమ్స్, అప్లికేషన్స్ వల్ల మొబైల్ విపరీతంగా హీట్‌ అవుతుంది. వాటిని వెంటనే అన్ ఇన్‌స్టాల్ చేసెయ్యాలి. మొబైల్ ఛార్జింగ్ అయినా వెంటనే వీడియో కాల్, హెవీ గేమ్స్ ఆడకూడదు. ఛార్జింగ్ అయిన తరువాత మొబైల్ హీట్ అయితే 5 నిమిషాల వరకు మొబైల్‌ని పట్టుకోకూడదు.. ప్యాంట్ జేబులో కూడా పెట్టుకోకూడదు.
 
మొబైల్ ఛార్జింగ్‌లో లేనప్పుడు కూడా పేలిపోయ్యే ఛాన్స్ ఉంది. టైట్ జీన్స్‌లో మొబైల్‌ని బలవంతంగా ఇరికిస్తే పేలే ప్రమాదం ఉంది. మొబైల్ వాడేటప్పుడు కూడా బాగా హీట్ అయితే వెంటనే స్విచ్ ఆఫ్‌ చేసి చల్లబడ్డాక ఆన్ చేయాలి. మీ మొబైల్ బ్యాటరీ అయిపోతే వెంటనే కొత్త ఒరిజినల్ బ్యాటరి తీసుకొని మార్చాలి. కొంతమంది ఛార్జింగ్ పెట్టి ఇయర్ ఫోన్స్‌లో సాంగ్స్ వింటుంటారు. అలా చేయడం వల్ల చాలా రిస్క్. ఇలాంటి విషయాల్లో కూడా ఇప్పటికే ముగ్గురు చనిపోయారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments