Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.10 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో ఫోన్ ఆర్డర్ చేస్తే.. రూ.20 విలువ చేసే విమ్‌బార్ పంపించారు

ఆన్‌లైన్ మోసం మరోమారు బహిర్గతమైంది. ఈ-కామర్స్ వ్యాపారం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అదేసమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ మోసం కూడా. రూ.10 వేలు చెల్లించి ఆన్‌

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (13:59 IST)
ఆన్‌లైన్ మోసం మరోమారు బహిర్గతమైంది. ఈ-కామర్స్ వ్యాపారం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. అదేసమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి నిదర్శనమే ఈ మోసం కూడా. రూ.10 వేలు చెల్లించి ఆన్‌లైన్‌లో ఫోను కోసం ఆర్డర్ చేస్తే రూ.20 విలువ చేసే విమ్‌బార్‌ను పార్శిల్‌లో పంపించారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో జొన్నాదుల హేమవరప్రసాద్ అనే వ్య‌క్తి ఆన్‌లైన్‌లో ఫోన్ కోసం రూ.9,800 చెల్లించి ఫోన్‌కు ఆర్డర్ ఇచ్చాడు. ఆ తర్వాత సదరు కంపెనీ పంపిన పార్శిల్‌ను విప్పి చూడగా, అందులో 20 రూపాయ‌ల విలువ చేసే సబ్బును పార్శిల్‌లో ఉంచింది. 
 
దీనిపై అతను స్పందిస్తూ... తాను ఈ నెల ఒకటో తేదీన పానసోనిక్ ఏ2 స్మార్ట్ ఫోన్ కోసం డ‌బ్బుచెల్లించి అమెజాన్ కంపెనీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన‌ట్లు హేమ‌వ‌ర‌ప్ర‌సాద్ తెలిపాడు. బ్లూడాట్ కొరియర్ సర్వీస్ డెలివరీ బాయ్ త‌న‌కు ఓ ప్యాకెట్‌ను ఇచ్చాడ‌ని, దాన్ని వెంట‌నే తెర‌చి చూశాన‌ని చెప్పాడు. అయితే, అందులో త‌న ఇచ్చిన ఆర్డ‌రు లేద‌ని విమ్‌బార్ సబ్బు ఉందని చెప్పాడు. 
 
ఈ విష‌యంపై తాను కొరియర్‌బాయ్‌ను అడ‌గ‌గా ఈ విష‌యంపై కంపెనీనే అడ‌గాల‌ని సూచించిన‌ట్లు చెప్పాడు. కొరియ‌ర్ పార్శిల్ వచ్చినట్లు సాక్ష్యం మాత్రమే ఇవ్వగలనని కొరియ‌ర్ బాయ్ త‌న‌కు చెప్పిన‌ట్లు పేర్కొన్నాడు. హేమవ‌ర‌ప్ర‌సాద్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రిటీష్ కాలం నాటి కథతో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్నచిత్రం

కమల్ హాసన్ థగ్ లైఫ్ వేడుకకు సమయంకాదని వాయిదా

Nagavamsi: యారగెంట్ మనస్తత్వం వున్నవాడితో సినిమా అవసరమా అనుకున్నా: నాగవంశీ

సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో రవి మోహన్ డేటింగ్?

శ్రీ విష్ణు, వెన్నెల కిషోర్ కాంబినేషన్ చిత్రం #సింగిల్‌ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments