టెలినార్ కొత్త ఆఫర్... రూ.73కే అపరిమిత 4జి డేటా... జియో షాక్
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన టెలినార్ సంస్థ తాజాగా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌లోని కొత్త 4జి వినియోగదారులకు కేవలం 73 రూపాయలకే అపరిమిత డేటాను ఇవ్వనున్నట్టు
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో ఒకటైన టెలినార్ సంస్థ తాజాగా బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిల్‌లోని కొత్త 4జి వినియోగదారులకు కేవలం 73 రూపాయలకే అపరిమిత డేటాను ఇవ్వనున్నట్టు తెలిపింది.
మొట్టమొదటిసారిగా 73 రూపాయలతో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు 30 రోజుల పాటు అపరిమితి 4జి/2జి ఇంటర్నెట్ సర్వీసులను అందించనున్నట్లు టెలినార్ తెలిపింది. ఈ ఆఫర్‌తో పాటు 90 రోజుల పాటు 25 పైసల (నిమిషానికి)కే లోకల్, ఎస్‌టిడి కాల్స్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది.
అలాగే లైఫ్‌టైమ్ వ్యాలిడిటీతో 25 రూపాయల ఉచిత టాక్‌టైమ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలిపింది. 30 రోజల తర్వాత అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ సర్వీసులను అందుకోవాలంటే 47 రూపాయల స్పెషల్ టారిఫ్ వోచర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.