Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్పార్క్‌10 5జీని విడుదల చేసిన టెక్నో: స్పార్క్‌ సిరీస్‌లో మొట్టమొదటి 5జీ ఫోన్‌

Webdunia
బుధవారం, 29 మార్చి 2023 (23:16 IST)
ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌, టెక్నో తమ మొట్టమొదటి 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తమ ఆల్‌రౌండర్‌ స్పార్క్‌ పోర్ట్‌ఫోలియో కింద నేడు భారతదేశంలో విడుదల చేసింది.  స్పార్క్‌ 10 5జీగా విడుదల చేసిన ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పార్క్‌ 10 ప్రో తరువాత స్పార్క్‌ 10 యూనివర్శ్‌లో విడుదలైన రెండవ ఫోన్‌. స్పార్క్‌ 10 5జీలో అత్యాధునిక స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ఉన్నాయి.
 
స్పార్క్‌ 10 5జీ ధర 12,999 రూపాయలు. దీనిలో డైమెన్శిటీ 6020 7ఎన్‌ఎం శక్తివంతమైన 5జీ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 13పై హెచ్‌ఐఓఎస్‌ 12.6 ఉన్నాయి. శక్తివంతమైన ప్రాసెసర్‌ సౌకర్యవంతమైన 5జీ కనెక్టివిటీని 10 బ్యాండ్‌ మద్దతుతో అందిస్తుంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌, మెమరీ ఫ్యూజన్‌ ఫీచర్‌తో ఉండటంతో పాటుగా 64 జీబీ అంతర్గత స్టోరేజీ ఉన్నాయి.
 
టెక్నో మొబైల్‌ ఇండియా సీఈఓ అర్జీత్‌ తాళపత్ర మాట్లాడుతూ ‘‘వినియోగదారులు నేడు నిత్యం అభివృద్ధి చెందడమే కాదు వేగవంతమైన, ఆధారపడతగిన కనెక్టివిటీ కోరుకుంటున్నారు. 15 వేల రూపాయల లోపు 5జీ ఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుని స్పార్క్‌ 10 5జీని ఆండ్రాయిడ్‌ 13తో విడుదల చేశాము. పరిశ్రమలో తొలిసారనతగ్గ ఫీచర్లను కలిగిన ఈ ఫోన్‌ను సరసమైన ధరలో అందిస్తున్నాము’’ అని అన్నారు. స్పార్క్‌ 10 5జీ మూడు ఆకర్షణీయమైన రంగులు- మెటా బ్లూ, మెటా వైట్‌, మెటా బ్లాక్‌లో ఏప్రిల్‌ 07, 2023 నుంచి దేశవ్యాప్తంగా లభిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

హీరోయిన్ శ్రీలీలతో డేటింగా? బాలీవుడ్ హీరో ఏమంటున్నారు!!

Ram Prakash : రిలేషన్, ఎమోషన్స్‌, వినోదం కలయికలో చెరసాల సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments