Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి టెక్నో కామోన్-16 స్మార్ట్ ఫోన్.. ధర రూ.10,999

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (16:13 IST)
Tecno Camon
భారత్‌లో టెక్నో కామోన్-16 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ నుంచి అందుబాటులో ఉండనుంది. క్లౌడ్ వైట్, ప్యూరిస్ట్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఉన్న అన్ని ఫోన్లలో ఇదే అత్యంత చౌకైన 64 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్ కావడం విశేషం. 
 
ఇందులో 6.8 అంగుళాల హెచ్‌డీ+ హోల్ పంచ్ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ టు బాడీ రేషియో 89.1 శాతంగా ఉంది. మీడియాటెక్ హీలియో జీ79 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సెన్సార్‌ను అందించారు.
 
ఈ ఫోనులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సెన్సార్ ఉండటం విశేషం. గత నెలలో టెక్నో కామోన్ 16 ప్రీమియర్ గ్లోబల్ లాంచ్ జరిగినప్పుడు కామోన్ 16ను కూడా ప్రకటించారు. ఇందులో వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అందించారు. దీని సెల్ఫీ కెమెరా సామర్థ్యం 16 మెగా పిక్సెల్ గా ఉంది. ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేను కూడా అందించారు. 
 
ఇందులో కేవలం 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.10,999గా నిర్ణయించారు. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత హైఓఎస్ 7.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సాయిపల్లవి, విజయ్ సేతుపతికి అవార్డులు.. ఏంటవి?

వంద అడుగుల ఎత్తు ఎన్టీఆర్‌ విగ్రహానికి అనుమతిచ్చిన రేవంత్ రెడ్డి

నటిగా ఛాలెంజింగ్ పాత్ర డ్రింకర్ సాయి లో పోషించా : ఐశ్వర్య శర్మ

Sriya Reddy: పవన్ కళ్యాణ్ గురించి శ్రియా రెడ్డి ఏమన్నారంటే..?

నేనూ మనిషినే.. ఆరోగ్య సమస్యలు సహజం : శివరాజ్ కుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments