Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడ్జెట్ స్మార్ట్‌ ఫోన్ 'స్వైప్ ఎలైట్ 2'.. ధర రూ.7999...

Webdunia
మంగళవారం, 26 ఏప్రియల్ 2016 (14:58 IST)
ప్రస్తుతం మొబైల్ ప్రపంచమంతా స్మార్ట్ ఫోన్లపై పరుగెడుతోంది. మొబైల్ కంపెనీలు రోజుకో కొత్త రకాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నాయి. వీటిలో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ల నుంచి కారుచౌక ఫోన్ల వరకు ఉన్నాయి. ఇలాంటి వాటిలో స్వైప్ టెక్నాలజీ సంస్థ స్వైప్ ఎలైట్ 2 పేరుతో అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది.
 
ఇందులో అత్యంత ఖరైదీన స్మార్ట్ ఫోన్లలో ఉండే ఫీచర్లు ఉండటం విశేషం. ముఖ్యంగా 5.5 అంగుళాల తెర, హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ప్యానెల్,  2.5డి ఆర్క్ టచ్ స్క్రీన్, డ్యూయల్‌ కెమెరాలు, 64 బిట్ మీడియాటెక్ ఎంటీకే 6735 క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 4జీ నెట్‌వర్క్‌ సపోర్ట్ వీటితో పాటు.. 1.3జీహెచ్‌జడ్ జీబీ ర్యామ్, ఇంటర్నల్‌ మెమొరీ 16 జీబీ. కావాలంటే ఎస్‌డీకార్డ్‌తో 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. 
 
ముందు 5 మెగాపిక్సల్, వెనుక 8 మెగాపిక్సల్‌. ఆండ్రాయిడ్‌ లాలీపాప్‌ 5.1 ఓఎస్‌ వెర్షన్‌. 4జీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్‌, యూఎస్‌బీ, జీపీఎస్‌ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తుంది. బ్యాటరీ సామర్థ్యం 3,000 ఎంఏహెచ్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ ఫోన్ ధర రూ.7999 మాత్రమే. ఈ ఫోన్ కావాలనుకునే వారు ఫ్లిప్‌కార్ట్‌కి ప్రత్యేకం. ముందుగానే అడ్వాన్స్‌ బుకింగ్‌ చేసుకోవాలి. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments