Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుందర్ పిచాయ్‌కు గ్రేట్ ఇమ్మిగ్రెట్స్ అవార్డు.. మరో ముగ్గురికి కూడా..

భారత సంతతి వ్యక్తి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన ''గ్రేట్ ఇమ్మిగ్రెట్స్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా'' అవార్డు వరించింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ ప్రత్యేక పురస్కా

Webdunia
గురువారం, 30 జూన్ 2016 (11:05 IST)
భారత సంతతి వ్యక్తి, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు అయిన ''గ్రేట్ ఇమ్మిగ్రెట్స్: ది ప్రైడ్ ఆఫ్ అమెరికా'' అవార్డు వరించింది. ఈయనతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ ప్రత్యేక పురస్కారం అందనుంది. జూన్ 30న జరిగే కార్యక్రమంలో ఎంపికైన వారిని అమెరికాలోని కార్నీజియా కార్పొరేషన్ సత్కరించనుంది. సుందర్ పిచాయ్‌తో పాటు పీబీఎస్ న్యూస్ అవర్‌కు చెందిన ప్రఖ్యాత వ్యాఖ్యాత, సినియర్ కరస్పాండెంట్ హరి శ్రీనివాసన్, మెకన్సీ అండ్ కంపెనీ ఛైర్మన్ విక్రమ్ మల్హోత్రా, నేషనల్ బుక్ క్రిటిక్ సర్కిల్ అవార్డు విజేత, రచయిత భారతీ ముఖర్జీలకు ప్రైడ్ ఆఫ్ అమెరికా అవార్డును అందజేయనున్నారు. 
 
అమెరికాకు గర్వకారణమైన నలుగురు ప్రవాస భారతీయులకు ఆదేశం ప్రత్యేక గౌరవాన్ని అందించనుంది. 'గ్రేట్ ఇమ్మిగ్రెంట్ ప్రైడ్ ఆఫ్ అమెరికా' పేరిట కార్నెగీ కార్పొరేషన్ ఈ అవార్డులను ప్రతి యేటా అందిస్తున్నసంగతి తెలిసిందే. 2016 సంవత్సరానికి గానూ విదేశీ మూలాలు కలిగిన మొత్తం 30 దేశాలకు చెందిన 42 మందిని పురస్కారాలకు ఎంపిక చేయగా.. వారిలో ప్రవాస భారతీయులు నలుగుర్ని ఈ ప్రత్యేక పురస్కారం వరించింది. 
 
ఈ సందర్భంగా కార్నిజీయా కార్పొరేషన్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. ''మనపూర్వీకుల లాగే  వీరుకూడా అమెరికాకు వలసవచ్చి దేశాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నారు. ఆర్థిక అవకాశాల కోసం విద్య, రాజకీయాలు, భద్రతా తదితర కారణాలతో వచ్చే లక్షలాది వలసవాదులకు వీరు ప్రతినిధులుగా ఉన్నారు. సగటు అమెరికన్ పౌరుడు దేశాన్ని ఏ విధంగానైతే ప్రేమిస్తున్నాడో అదేతీరు విశ్వాసాన్ని వీరు కలిగిఉన్నారని ఆయన చెప్పడం గమనార్హం. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆది పినిశెట్టి బైలింగ్వల్ మూవీ శబ్దం థ్రిల్లింగ్ స్పైన్-చిల్లింగ్ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ ను మార్చిన తెజస్వని - పారితోషికం రెట్టింపు !

కాశీ మహా కుంభమేళాలో తమన్నా భాటియా ఓదెల 2 టీజర్

బాపు సినిమా చూసి నాకు రెమ్యునరేషన్ వచ్చేలా చేయండి : యాక్టర్ బ్రహ్మాజీ

RGV on Saaree: శారీ.. చీరలో ఉన్న అమ్మాయి.. రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments