Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి స్కామ్ కేసులో శామ్‌‍సంగ్ వైస్ ఛైర్మన్ యంగ్‌కు ఊరట..

అవినీతి స్కామ్‌ కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ లీజే యంగ్‌కు కోర్టు ఊరట లభించింది. రెండు సంస్థల విలీనానికి సంబంధించి రాజకీయ మద్దతు కోసం ఆ దేశాధ్యక్షురాలికి సంబంధించిన సంస్థలక

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (15:46 IST)
అవినీతి స్కామ్‌ కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ లీజే యంగ్‌కు కోర్టు ఊరట లభించింది. రెండు సంస్థల విలీనానికి సంబంధించి రాజకీయ మద్దతు కోసం ఆ దేశాధ్యక్షురాలికి సంబంధించిన సంస్థలకు భారీ విరాళం అందజేశారనే ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు వారెంటు జారీ చేయాలని ప్రాసిక్యూషన్‌ కోరింది. దీనిని ఆ దేశ న్యాయస్థానం తిరస్కరించింది. 
 
ఇప్పటికే ఈ కేసులో అధ్యక్షురాలిని పదవి నుంచి దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాము ఎటువంటి తప్పు చేయలేదని శామ్‌సంగ్‌ ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షురాలు లంచాలు స్వీకరించేందుకు సన్నిహిత మిత్రుడైన చోయ్‌ సూన్‌ సిల్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థను వాడుకుంటారనే ఆరోపణలున్నాయి. ఇందుకు విరాళాలు ఇచ్చినట్లు యంగ్‌పై ఆరోపణలున్నాయి. దీనిపై యంగ్ స్పందిస్తూ.. విరాళాలు ఇచ్చిన మాట నిజమే కానీ తాము ఏదీ ఆశించలేదన్నారు.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments