పెరిగిపోతున్న మొబైల్ ఫోన్ల ధరలు.. 12 నుంచి 18 శాతానికి పెంపు

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (13:40 IST)
దేశంలో మొబైల్ ఫోన్ల ధరలు పెరుగుతున్నాయి. యాపిల్, షియోమీ, సామ్‌సంగ్‌, పొకొ, రియల్‌మీ వంటి సంస్థలు స్మార్ట్‌ఫోన్‌ ధరలను పెంచేశాయి. ఈ మేరకు మొబైల్ ఫోన్లపై 12 శాతం నుంచి 18 శాతానికి పెంచుతున్నట్లు జీఎస్టీ ప్రకటించింది. ఈ ధరల పెంపు కొత్త మోడళ్లపైనే కాకుండా పాత మోడళ్లపై కూడా వున్నాయి. ఇప్పటికే ఐఫోన్ 11 ప్రో, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌7 వంటి వాటిపై ఐదు శాతం చొప్పున ధరలు పెంచుతున్నట్లు యాపిల్‌ ప్రకటించింది.
 
ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ (64జీబీ) ధర ఇంతకు ముందు రూ.1,11,200 గా ఉండేది. ఇప్పుడు దాని ధర 1,17,100కు చేరింది. అలాగే ఐఫోన్‌ 11 ప్రో (64 జీబీ) ఇంతకు ముందు రూ.1,01,200గా ఉండేది. ఇప్పుడు రూ.1,06,600కు చేరింది. 
 
అలాగే, షియోమీ, పొకొ, ఒప్పో, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. వీటి ధరలను ఆయా సంస్థల వెబ్‌సైట్లను సంప్రదించవచ్చు. ఇంకా సామ్‌సంగ్‌ కూడా కొత్త ధరలను ప్రకటించింది. న్యూ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ఇప్పుడు రూ.70,500గా ఉంది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌20 ప్లస్‌ ఇప్పుడు రూ.77,900కు చేరింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments