మీ ఫోన్‌లో ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇక అంతేసంగతులు...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (12:47 IST)
ఈమధ్య కుర్రకారుకి ఫోటోలు, సెల్ఫీలు పిచ్చి బాగా ఎక్కువైన సంగతి తెలిసిందే. ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు తీసుకోవడం ఆ తర్వాత వాటిని తమకు నచ్చిన విధంగా క్రాప్ చేసుకుని మలచుకోవడం చేస్తున్నారు. ఇందుకోసం ఫోటో ఎడిటింగ్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం మామూలే. 

ఐతే ఇప్పుడు ఈ ఫోటో ఎడిటింగ్ యాప్స్‌లో 29 చాలా ప్రమాదకరమైనవనీ, ఫోన్లో వున్న డేటాను మొత్తం తస్కరించే టైపునీ అందులో మాల్వేర్ వున్నట్లు గుర్తించామని ట్రెండ్ మైక్రో తెలిపింది. దీనితో ఇప్పుడు ఆ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న యూజర్ల డేటా ఫిక్సులో పడిపోయినట్లయింది. 
 
వీటిలో ముఖ్యంగా ప్రో కెమెరా సెల్ఫీ కెమెరా ప్రో, ఫోటో ఎడిటర్, ఆర్ట్ ఎఫెక్ట్, వాల్‌పేపర్స్ హెచ్‌డీ, బ్యూటీ, ఇమోజి కెమెరా, ప్రిజ్‌మా ఫోటో ఎఫెక్ట్ వంటి యాప్స్ వున్నట్లు గుర్తించారు. ఈ యాప్స్ యూజర్లను పోర్నోగ్రాఫిక్ వీడియో ప్లేయర్లను డౌన్లోడ్ చేసేలా చేయడమే కాకుండా ఫిషింగ్ వెబ్ సైట్లలోకి వెళ్లేలా చేస్తాయని హెచ్చరించారు. 
 
అంతేకాదు.. వీటిని డౌన్లోడ్ చేసుకునే ముందు ఫోన్ నెంబరు, అడ్రెస్ వివరాలు కూడా అడుగుతాయనీ, అలా క్రమంగా ఫోన్లో వున్న సమాచారాన్ని మొత్తం తస్కరించబడుతుందని చెప్పారు. అందువల్ల ఇలాంటి యాప్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకుని వున్నట్లయితే తక్షణమే వాటిని డిలీట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments