Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో గుడ్ న్యూస్ : 4జీ ఫీచర్ ఫోన్ సెకండ్ సేల్

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. జియో విక్రయిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ రెండో విడత విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రటించింది.

Webdunia
సోమవారం, 27 నవంబరు 2017 (20:21 IST)
దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. జియో విక్రయిస్తున్న 4జీ ఫీచర్ ఫోన్ రెండో విడత విక్రయాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రటించింది.
 
తాజాగా జియో ఫోన్ కొనుగోలుకు ఆసక్తి చూపించిన వారికి మెసేజ్‌లు పంపించేందుకు జియో రంగం సిద్ధం చేసింది. ఆ లింక్ క్లిక్ చేసిన వినియోగదారులకు తమ దగ్గర్లోని ఔట్‌లెట్‌కు సంబంధించిన సమాచారం వస్తుంది. అక్కడికి వెళ్లి జియో ఫోన్‌ను తీసుకోవచ్చు.
 
నిజానికి ఈ సంస్థ ప్రవేశపెట్టిన ఈ ఫోన్లకు భారీ ఎత్తున డిమాండ్ ఏర్పడిన విషయంతెల్సిందే. దీంతో ఫోన్ల బుకింగ్‌ను నిలిపివేసింది. అదేసమయంలో బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ అనుకున్న గడువులోనే ఫీచర్ ఫోన్లను సరఫరా చేసింది. ఇపుడు రెండో విడత ఫోన్ బుక్కింగ్స్‌ను ప్రారంభించింది. 
 
ప్రస్తుతం జియో ఫోన్‌కు ఇతర టెల్కోల నుంచి విపరీతమైన పోటీ నెలకొనివున్న విషయం తెల్సిందే. జియో ఫోన్‌కు చెల్లిస్తున్న మొత్తానికి కాస్త అటూఇటుగా అదే ధరతో 4జీ స్మార్ట్‌ఫోన్లను ఇతర కంపెనీలు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. 
 
ఇందులోభాగంగా, ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఇప్పటికే స్మార్ట్‌ఫోన్ మేకర్ కార్బన్‌తో కలిసి రూ.2 వేలకే స్మార్ట్‌ఫోన్ అందిస్తోంది. అలాగే, మరో టెల్కో వొడాఫోన్.. మైక్రోమ్యాక్స్‌తో చేతులు కలిపి రూ.999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, ఐడియాతో పాటు.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా చౌకధరకే ఫోన్ అందిచనున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments