Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 బడ్జెట్ ఫోన్.. ఫీచర్స్ ఇవే..

Webdunia
శనివారం, 28 మే 2022 (19:42 IST)
Samsung Galaxy M13
ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ సామ్‌సంగ్‌  కొత్తగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13ను లాంచ్ చేసింది. గత సంవత్సరం రిలీజై పాపులర్ అయిన గెలాక్సీ ఎం12కు ఇది సక్సెసర్‌గా వచ్చింది. 5000ఎంఎహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ డిస్‌ప్లేతో సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 వస్తోంది. 
 
అలాగే వెనుక మూడు కెెమెరాలు ఉండగా.. ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్ సామర్థ్యంతో ఉంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత వన్ యూఐ కోర్ 4.1 ఓఎస్‌తో శామ్‌లసంగ్ శామ్‌సంగ్ గాలెక్సీ ఎం 13 వస్తోంది.  
 
6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ ఇన్ఫినిటీ వీ ఎల్సీడీ డిస్‌ప్లేను ఈ మొబైల్‌ కలిగి ఉంది. 
 
ఆక్టాకోర్ ఎగ్జినోస్ 850  ప్రాసెసర్‌ ఈ ఫోన్‌లో ఉంటుంది. 64జీబీ, 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.  
 
సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 ఫోన్‌ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. 
 
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను సామ్‌సంగ్‌ ఇస్తోంది. 4జీ, ఎల్‌టీఈ, వైఫై 5, బ్లూటూత్ 5, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ కనెక్టివిటీ ఫీచర్లుగా ఉన్నాయి.
 
ప్రస్తుతం ఈ సామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 ఫోన్ 4జీతో వస్తుండగా.. 5జీ మోడల్‌ను కూడా లాంచ్ చేయాలని సామ్‌సంగ్‌ ప్లాన్‌ చేస్తోంది. త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments