Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిక్ టాక్ బ్యాన్: షేర్ చాట్‌ను కొనుగోలు చేయనున్న ట్విట్టర్?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (18:29 IST)
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ట్విట్టర్‌కు భారత మార్కెట్లో మాంచి క్రేజ్ వుంది. ఈ క్రేజ్‌ను ఉపయోగించుకుని ట్విట్టర్ తన వ్యాపారాన్ని విస్తరించే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా సోషల్ మీడియాలో బాగా పాపులరైన షేర్ చాట్‌ను కొనుగోలు చేసేందుకు ట్విట్టర్ సిద్ధంగా వున్నట్లు వార్తలు వస్తున్నాయి. షేర్ చాట్‌ను కైవసం చేసుకోవడం ద్వారా.. దానికి సొంత ఇమేజ్‌ను ట్విట్టర్ ఖాతాలో పడుతుంది. 
 
టిక్ టాక్ బ్యాన్ అయిన తర్వాత దానికి సమానంగా ప్రపంచ వ్యాప్తంగా షేర్ చాట్ పాపులర్ అనే సంగతి తెలిసిందే. అలాంటి షేర్ చాట్‌ను సొంతం చేసుకోవడం ద్వారా ట్విట్టర్ వ్యాపారం విస్తరించే ఛాన్సుందని టెక్ క్రంచ్ వెల్లడించింది. ఇందులో భాగంగా 1.1 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడి పెట్టేందుకు ట్విట్టర్ సిద్ధమని తెలుస్తోంది. కానీ షేర్ చాట్ నుంచి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 
 
భారత్‌లో 160 మిలియన్ల యూజర్లను కలిగివుంది షేర్ చాట్. అన్నీ ప్రాంతీయ భాషల్లో వుండే ఈ షార్ట్ వీడియో యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 80 మిలియన్ల డౌన్‌డోన్లను దాటి కొత్త మైలురాయిని చేరింది. కాగా టిక్ టాక్‌ను భారత్‌లో నిషేధించిన నేపథ్యంలో షేర్ చాట్‌ను వినియోగించే వారి సంఖ్య పెరిగిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments