Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో ఏరోవాయిస్ టెలికాం సేవలు.. బ్రాడ్‌బాడ్ - ఫైబర్ బ్రాండ్ సేవలు కూడా...

దేశంలో మరో టెలికాం కంపెనీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్.ఆర్.ఐకు చెందిన యాడ్‌పే మొబైల్ పేమెంట్స్ సంస్థ ఏరోవాయిస్ పేరుతో టెలికామ్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు తొలుత తమిళనాడు నుంచి ప్రారంభించింది.

Webdunia
శుక్రవారం, 14 ఏప్రియల్ 2017 (16:47 IST)
దేశంలో మరో టెలికాం కంపెనీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎన్.ఆర్.ఐకు చెందిన యాడ్‌పే మొబైల్ పేమెంట్స్ సంస్థ ఏరోవాయిస్ పేరుతో టెలికామ్ సేవలను ప్రారంభించింది. ఈ సేవలు తొలుత తమిళనాడు నుంచి ప్రారంభించింది. ఈ కంపెనీ సేవలను మరింతగా విస్తృతం చేసేందుకు వచ్చే మూడేళ్లలో రూ.300 కోట్ల మేరకు పెట్టుబడి పెట్టనుంది. అలాగే, ఈ కంపెనీ ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. 
 
ఇదే అంశంపై ఆ కంపెనీ సీఈఓ శివకుమార్ కుప్పుస్వామి మాట్లాడుతూ ఏరోవాయిస్ పేరుతో ఇంటర్నేషనల్ సిమ్ కార్డుతో పాటు.. ఇంటర్నెట్ సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. తమ కంపెనీ సేవలకు టెలికాం నియంత్రణ మండలి ట్రాయ్ గత యేడాది అనుమతి ఇచ్చిందన్నారు. ఈ ప్రకారంగా గత యేడాది డిసెంబరు నెలలో ఎంవీఎన్ఓ లైసెన్సును అధికారింగా పొందగా, ఇపుడు సేవలను ప్రారంభించినట్టు తెలిపారు. 
 
కాగా, తమ కంపెనీ బేసిక్ ప్లాన్ రూ.249 నుంచి ప్రారంభమవుతుందన్నారు. తరచూ విదేశాలకు వెళ్లి వచ్చేవారి కోసం ఇంటర్నేషనల్ సిమ్ కార్డును ప్రవేశపెట్టామని, దీని ధర 15 అమెరికన్ డాలర్లని తెలిపారు. ఇందులో 50 ఎంబీ డేటాతో పాటు.. 100 నిమిషాల టాక్‌టైమ్ అపరిమిత కాలపరిమితితో ఉంటుందని తెలిపారు. 
 
ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టవిటీ సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీన్ని అధికమించేందుకు తాము కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా పది వేల నుంచి 50 వేల మంది జనాభా కలిగిన ప్రాంతాల్లో తమ సేవలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం సేలం, కోయంబత్తూరు, తంజావూరు, కడలూరు, కన్యాకుమారి జిల్లాలపై దృష్టిసారించినట్టు తెలిపారు. కాగా, తొలి బ్రాండ్‌బాండ్ కనెక్టవిటీ కనెక్షన్‌ను హీరో ప్రశాంత్ పొందారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

కేన్సర్ జీనోమ్ డేటాబేస్‌ను ప్రారంభించిన ఐఐటీ-మద్రాస్

తర్వాతి కథనం
Show comments