Webdunia - Bharat's app for daily news and videos

Install App

రిలయన్స్‌కు చుక్కలు చూపుతున్న టెలికాం కంపెనీలు.. జియో నుంచి ఫోన్ వచ్చిందా.. కాల్‌‌డ్రాప్...

రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు చుక్కలు చూపుతున్నాయి. జియో నుంచి ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు వచ్చే ఫోన్ కాల్స్‌ అన్నీ కాల్ డ్రాప్ అవుతున్నాయి. దీంతో జియో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 1

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (14:06 IST)
రిలయన్స్ జియోకు టెలికాం కంపెనీలు చుక్కలు చూపుతున్నాయి. జియో నుంచి ఇతర టెలికాం నెట్‌వర్క్‌లకు వచ్చే ఫోన్ కాల్స్‌ అన్నీ కాల్ డ్రాప్ అవుతున్నాయి. దీంతో జియో కస్టమర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత 10 రోజుల్లోనే జియో కస్టమర్లు 52 కోట్ల కాల్స్ ఫెయిలయ్యాయి. ఇది రిలయన్స్ జియోకు గట్టి ఎదురుదెబ్బవంటిది. 
 
దీనికి కారణం లేకపోలేదు. ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తామంటే ఏం చేయలేక ఇతర కంపెనీలు చేతులెత్తేశాయి. కానీ రిలయన్స్ జియో తమ పొట్ట కొడుతున్నాయని భావించిన అన్ని కంపెనీలు ఒక్క విషయంలో మాత్రం ఏకమయ్యాయని జియో చెబుతోంది. తమ నెట్‌వర్క్ నుంచి చేసే కాల్స్‌పై అన్ని కంపెనీలు కక్ష కట్టాయని జియో ఆరోపిస్తోంది. 
 
కాల్ డ్రాప్స్ విషయంలో ఎయిర్‌టెల్‌‌పైనే రిలయన్స్ జియో ప్రధానంగా ఆరోపిస్తోంది. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదులకు సమాధానం చెప్పలేక జియో నానా అవస్థలు పడుతోంది. జియో వినియోగదారులు ఒక్క వొడాఫోన్ నెట్‌వర్క్‌కే ఈ 10 రోజుల్లో 52 కోట్ల కాల్స్ ఫెయిలయినట్లు తెలిసింది. జియో నుంచి వొడాఫోన్‌కు 100 కాల్స్ చేస్తుంటే అందులో 80 కాల్స్ ఫెయినట్లు తేలింది. 
 
ఈ కాల్‌డ్రాప్స్ సమస్యతో దాదాపు రోజుకు 5 లక్షల మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నట్టు సమాచారం. ఇది టెలికామ్ కంపెనీల మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం వినియోగదారులను చిక్కుల్లోకి నెట్టేస్తోంది. ఈ విషయాన్ని టెలికామ్ రెగ్యులేటరీ సంస్థ ట్రాయ్‌ దృష్టికి రిలయన్స్ జియో తీసుకెళ్లింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

సీనియర్ నటుడు, వ్యాఖ్యాత ఎ.వి. రమణ మూర్తి అమర్నాధ్ యాత్రలో కన్నుమూత

ఎన్.టి.ఆర్. జూనియర్ దేవర తాజా అప్ డేట్ ఇదే!

బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్‌లో వేణుస్వామి ఫిక్స్.. చరిత్రలోనే అత్యధిక పారితోషికం..??

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments