Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేటా స్పీడులోనూ జియోనే టాప్.. తర్వాతే ఎయిర్‌టెల్, ఐడియా

టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో డేటా స్పీడులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. రిలయన్స్ జియో టెలికాం సర్వీసులను వాణిజ్యపరంగా ప్రారంభించి ఒక సం

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (10:56 IST)
టెలికామ్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తూనే కోట్లాది మంది వినియోగదారులను సొంతం చేసుకున్న రిలయన్స్ జియో డేటా స్పీడులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. రిలయన్స్ జియో టెలికాం సర్వీసులను వాణిజ్యపరంగా ప్రారంభించి ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) టెలికాం కంపెనీల డేటా స్పీడ్‌పై వివరాలు ప్రకటించింది.  
 
2018 ఏడాది జులై నెలలో స్పీడు విషయంలో రిలయన్స్‌ జియోనే టాప్‌లో నిలిచినట్టు ట్రాయ్ తెలిపింది. ఆ నెల‌లో సగటు డౌన్‌లోడ్‌ స్పీడు 18.331 ఎంబీపీఎస్ అని తెలిపింది. వరుసగా ఏడు నెలలు జియోనే టాప్‌లో ఉంది. జియో త‌రువాత ఎయిర్‌టెల్‌ స్పీడు 9.266 ఎంబీపీఎస్‌, ఐడియా సెల్యులార్‌ స్పీడు 8.833 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ ఇండియా స్పీడు 9.325ఎంబీపీఎస్‌గా ఉందని ట్రాయ్ తెలిపింది.  
 
ఇదిలా ఉంటే.. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రిలయన్స్ జియో జియోఫై సరికొత్త ఆఫర్ ప్రకటించింది. రిలయన్స్ జియో అదిరిపోయే డేటా ఆఫర్‌ను ప్రకటించింది. రూ. 1,999కే అపరిమిత వాయిస్ కాల్స్‌పాటు కొత్త వినియోగదారులకు జియోఫై వైఫై రోటర్ అందించనుంది.

వినియోగదారులు జియో 4జీ ఇంటర్నెట్ సేవల కోసం 2జీ, 3జీ స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌టాప్స్, టాబ్లెట్స్ ద్వారా కనెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తుంది. ఈ ఆఫర్ జియో స్టోర్లు, జియో వెబ్‌సైట్‌ ద్వారా పొందవచ్చని సంస్థ ప్రకటించింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments