Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్జాతీయ టెలికాం మార్కెట్‌పై జియో కన్ను.. రూ.501 రీఛార్జ్ చేసుకుంటే?

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అంతర్జాతీయ టెలికామ్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐఎస్‌డీ కాల్ రేట్స్‌కు సంబంధించి ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (13:24 IST)
ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అంతర్జాతీయ టెలికామ్ మార్కెట్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఐఎస్‌డీ కాల్ రేట్స్‌కు సంబంధించి ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.501తో రీఛార్జ్ చేసుకోవడం ద్వారా నిమిషానికి ఇంటర్నేషనల్ కాల్స్‌కు మూడు రూపాయల చొప్పున చెల్లించి పొందవచ్చునని జియో తెలిపింది. దీనిని రేట్ కటర్ ప్లాన్‌గా జియో ప్రకటించింది. 
 
అంతేకాదు, 501 రూపాయలతో రీచార్జ్ చేయిస్తే సర్వీస్ యాక్టివేషన్‌తో పాటు పూర్తి మొత్తంలో బ్యాలెన్స్ కూడా పొందొచ్చు. ఇందులో భాగంగా అమెరికా, ఇంగ్లండ్, కెనడా, సింగపూర్ దేశాల్లో ఉన్న తమవారికి భారత్ నుంచి కేవలం నిమిషానికి 3రూపాయలు చెల్లించి కాల్స్ చేసుకోవచ్చునని జియో ప్రకటించింది. 
  
ఈ ఐఎస్డీ కాల్స్ హాంకాంగ్, ఇటలీ, మంగోలియా, మొరాకో, న్యూజిలాండ్, పోలాండ్, పోర్చుగల్,  అండోరా, ఆస్ట్రియా, బెల్జియం, బ్రెజిల్, రొమానియా, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్ దేశాలకు కూడా నిమిషానికి 3 రూపాయలు చెల్లించి వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని జియో ఓ ప్రకటనలో తెలిపింది.
 
మరోవైపు రిలయన్స్ జియో మరో సంచలనమైన ఆఫర్‌ను ప్రకటించింది. తాజాగా శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్ 8, గెలాక్సీ ఎస్ 8 ప్లస్ కొనుగోలు చేసిన వారికి జియో బంఫర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో, శాంసంగ్ భాగస్వామ్యంలో ఈ ఫోన్లను కొనుగోలు చేసిన జియో యూజర్లకు డబుల్ డేటా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. కొత్తగా శ్యాంసంగ్ గెలాక్సీ ఎస్ 8, ఎస్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేసిన వారికి 448 జీబీ 4 జీ డేటాను 8 మాసాలపాటు ఉచితంగా అందించనున్నట్టు జియో ప్రకటించింది. అయితే నెలకు రూ.309 లతో రీచార్జీ చేసుకోవాలని జియో ప్రకటించింది. అలాగే ధనాధన్ ప్లాన్ కిందే ఈ ఆఫర్ ను తెచ్చింది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రేమ-పెళ్లికి ప్రభాస్ అందుకే దూరం.. ఏం జరిగిందంటే?

Keerthi Suresh: మేము 15 సంవత్సరాలుగా ప్రేమలో వున్నాం.. ఆ రింగు నా చేతిలోనే..? కీర్తి సురేష్

డాకు మహారాజ్ నుంచి బాలకృష్ణ, ఊర్వశి రౌతేలా పై దబిడి దిబిడి సాంగ్

రాజమౌళి, మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ తెలిపిన రామ్ చరణ్

రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేయాలంటే నా పర్మిషన్ తీసుకో : రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కోడి గుడ్లు, పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

అతి నిద్రతో అనారోగ్య సమస్యలు, ఏంటవి?

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

కాలేయంను పాడుచేసే సాధారణ అలవాట్లు, ఏంటవి?

కిడ్నీ హెల్త్ ఫుడ్స్ ఇవే

తర్వాతి కథనం
Show comments