Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్క్ ఫ్రమ్ హోం కోసం జియో న్యూ ప్లాన్ : గూగుల్ - ఫేస్‌బుక్ కీలక నిర్ణయం!

Reliance Jio
Webdunia
శుక్రవారం, 8 మే 2020 (22:32 IST)
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికాం సంస్థగా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో కీలక నిర్ణయం తీసుకుంది. వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగుల కోసం ప్రత్యేక ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2,121 ప్లాన్‌కు అదనంగా రూ.2,399తో మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కాలపరిమితి 336 రోజులు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.2,121 ప్లానులో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుండగా, కొత్త ప్లాన్‌లో రోజుకు రెండు జీబీ డేటాను ఉచితంగా పొందవచ్చు. 
 
అంతేకాకుండా వర్క్ ఫ్రమ్ హోం చేసే ఉద్యోగుల కోసం యాడ్ ఆన్ ప్లాన్స్‌ను కూడా జియో ఆఫర్ తీసుకొచ్చింది. ఇవి రూ.151, రూ.201, రూ.251గా ఉంది. వీటికి రోజువారి డేటా పరిమితి లేదు. డేటా అయిపోయినప్పుడు ఏ సమయంలోనైనా వీటిని రీచార్జ్ చేసుకోవచ్చు.
 
మరోవైపు, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్‌తో పాటు.. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ యాజమాన్యాలు అత్యంత కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ ఉద్యోగులు కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు వీలుగా తమ సంస్థకు చెందిన ఉద్యోగులు ఈ  యేడాది ఆఖరు వరకు ఇంటి నుంచే పని చేయాలని ఆదేశించాయి. 
 
ప్రపంచవ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్న తీరును గమనిస్తున్న గూగుల్, ఫేస్‌బుక్ ఈ ఏడాది చివరి వరకు సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాకపోవచ్చని భావిస్తున్నాయి. అందుకే తమ ఉద్యోగులలో చాలా మందిని డిసెంబరు వరకు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పించాయి.
 
ఫేస్‌బుక్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఆఫీసులను మూసేసింది. జూలై 6 నాటికి కూడా ఫేస్‌బుక్ కార్యాలయాలు తెరుచుకోవడం కష్టమేననిపిస్తోంది. దాంతో ఈ సంవత్సరం మొత్తం ఇంటి నుంచే పని చేసుకోవచ్చంటూ ఉద్యోగులకు సూచించామని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 
 
గూగుల్ పరిస్థితి కూడా అందుకు భిన్నం కాదు. ఇటీవలే జరిగిన సంస్థాగత సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇదే తరహాలో స్పందించారు. ఈ ఏడాదిలో మిగిలిన భాగం అంతా ఇంటి నుంచి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 
 
అంతేకాదు, గూగుల్ మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా గూగుల్ ఉద్యోగులకు వేతనంలో భాగంగా అనేక ప్రోత్సాహకాలు ఉంటాయి. అయితే, ఇంటి నుంచి పనిచేసే కాలంలో ఈ ప్రోత్సాహకాలను నిలిపివేయాలని సంస్థ నిర్ణయించినట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాణి ముఖర్జీ మర్దానీ ఫ్రాంచైజీ మర్దానీ 3 ఫస్ట్ లుక్ రిలీజ్

అమరావతిలో అమర్‌దీప్ చౌదరి నటిస్తున్న సుమతీ శతకం ప్రారంభం

పాడుతా తీయగా జడ్జీలు పక్షపాతం చూపుతున్నారు.. ప్రవస్తి (Video)

అందుకే సీక్వెల్స్ కు దూరం - సారంగపాణి జాతకం థ్రిల్లర్, కామెడీ : శివలెంక కృష్ణ ప్రసాద్

Deverakonda : ముత్తయ్య నుంచి సీనిమాల యాక్ట్ జేశి.. సాంగ్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments